Hero Ashwin Babu : ఓంకార్ బుల్లితెర అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన షోస్ తో కంటే కూడా ఆ షోస్ లో ఉండే ఎమోషన్స్, గొడవలతోనే బాగా ఫేమస్. ఆట, మాయాద్వీపం, జీనియస్, తాజాగా సిక్స్త్ సెన్స్ ఇలా ప్రోగ్రాం ఏదైనా హైప్ మాత్రం ఓంకార్ షోలో ఎక్కువుటుంది. ఇక ఓంకార్ గారు మొదట జెమినీ మ్యూజిక్ లో యాంకర్ గా పనిచేసేవారు. ఆపైన షోస్ చేస్తూ పేరు తెచ్చుకున్నారు. ఇక తమ్ముడు అశ్విన్ బాబును హీరోగా పెట్టి సినిమాలను కూడా తీశారు. ‘రాజు గారి గది’ సినిమా హిట్ కూడా అయింది. ఆపైన వచ్చిన రాజు గారి గది 2 లో నాగార్జున, సమంత వంటి బిగ్ స్టార్స్ కూడా ఉన్నారు. ఇక తాజాగా ‘హిడింబ’ అనే సినిమాతో అశ్విన్ బాబు వస్తుండగా ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి కెరీర్ స్ట్రగ్గల్స్ గురించి తెలిపారు.

అన్నయ్యే అన్ని బాధ్యతలు తీసుకున్నాడు…
ఓంకార్ గారి గురించి అశ్విన్ బాబు మాట్లాడుతూ తమ తండ్రికి 2007లో పెరాలసిస్ రావడంతో ఇంటి బాధ్యత అన్న తీసుకున్నారు. అప్పుడే ఇంకా యాంకర్ గా వస్తున్న అన్నయ్య ఆ మరుసటి ఏడాది నాన్న చనిపోవడంతో ఇక మా కోసం కష్టపడ్డారు. చిన్నప్పటి నుండి మమ్మల్ని అన్నే నడిపించాడు అంటూ ఎమోషనల్ అయ్యారు అశ్విన్. అన్న నన్ను తమ్ముడిని ఇద్దరినీ చిన్నప్పటి నుండి గైడ్ చేస్తూ వచ్చారు.

నాకు అన్నయ్యకు మధ్య మరో అన్న ఉండేవాడు. చిన్నతనములోనే అన్న చనిపోయాడు. నాకూ ఓంకార్ అన్నకు గ్యాప్ నాలుగేళ్లు, ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళేవాళ్ళం నేను తమ్ముడు. ఆయన స్కూల్ కి సైకిల్ మీద ఇద్దరినీ కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళేవాడు. అయితే చిన్నప్పటి నుండి ఆయనే చూసుకున్నాడు. ఇపుడు కూడా ఆయన మీదే ఆధారపడలేము, అందుకే ఆయన ఇబ్బందులున్నాయా అని అడిగిన ఒక షోలో చెప్పలేక పోయాను. నా సినిమా ప్రయాణంలో చాలా కష్టాలను చూసాను, హిడింబ సినిమా సమయంలో కూడా చాలా స్ట్రగల్స్ ఫేస్ చేశాను అంటూ చెప్పారు అశ్విన్. ఇక ఓంకార్ అన్న గురించి ఆయనతో మాట్లాడిన వారికే తెలుస్తుంది ఆయనంటే ఏంటో, ట్రోల్స్ పెద్దగా పట్టించుకోడు అన్నయ్య, తన వల్ల కొంత మంది డబ్బు పేరు సంపాదించుకుంటే మంచిదే కదా అంటారు అన్నయ్య అంటూ చెప్పారు అశ్విన్.