Hero Jagapathi Babu : తెలుగులో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు బయట మాత్రం చాలా ప్రాక్టికల్ మనిషి. అందరూ హీరోలు ఇమేజ్ చట్రంలో ఉంటే తాను మాత్రం అందుకు భిన్నంగా నచ్చిన పాత్రలను చేస్తూ వచ్చాడు. ఇక ఒక వైపు ఫ్యామిలీ అభిమానులను పెంచుకుంటూనే మరోవైపు మాస్ సినిమాలను మధ్యలో ట్రై చేసాడు. ఇక తన జీవితం తన ఇష్టం అంటూ కుటుంబం విషయంలో తన విషయంలో సమాజం ఏమనుకుంటున్నది అన్న విషయాలను పెద్దగా పట్టించుకోని జగపతి బాబు తన కూతురు పెళ్లి విషయంలో ఇబ్బందులను బయట వారి కామెంట్స్ ఎదుర్కొన్నారు.

కులం గురించి మాట్లాడినందుకు ఆ కాలేజీ లో కొట్టేవారు….
తనకు కులం,మతం లాంటి పట్టింపులు లేవని అందుకే కూతురు ఒక అమెరికన్ ను లవ్ చేసానని చెప్పినపుడు పెళ్లి చెయడానికి అడ్డు చెప్పలేదని చాలా మంది నీకు కమ్మ వాళ్లలో ఎవరు దొరకలేదా ఎందుకు ఒక తెల్లవాడికి ఇచ్చి పెళ్లి చేసావ్ అంటూ కామెంట్స్ చేసారు. అలాంటివాటిని నేను పట్టించుకోలేదు అంటూ చెప్పారు. ఒకసారి సిద్ధార్థ కాలేజ్ విజయవాడ లో గెస్ట్ గా పిలిచినపుడు అక్కడ కులం గురించి మీ అభిప్రాయాలను మాట్లాడకండి ఇక్కడ చాలా మంది కమ్మవాళ్లు ఉన్నారు.

వాళ్ళు మిమ్మల్ని ఈ ఆడిటోరియం దాటి బయటకు పోనివ్వరు గొడవలు అవుతాయి అంటూ చెప్పినా స్టేజి మీదకి వెళ్ళాక కులం అంటూ ఎందుకు ప్రాకులాడుతారు అంటూ కమ్మ అయితే ఏంటి రెడ్డి అయితే ఏంటి అని మాట్లాడాను నేను పర్సనల్ సెక్యూరిటీ తో కూడా రాలేదు నన్ను చంపేసిన ఇక్కడ ఎవరు అడగరు కానీ నేను మాట్లాడుతాను అంటూ స్పీచ్ ఇవ్వగానే అక్కడ క్లాప్స్ కొట్టారట. అయితే నన్ను పోనిలే అని వదిలేసారో, వీడో మెంటలోడు అని వదిలేసారో తెలియదు కానీ అక్కడ నన్ను కొట్టకుండా క్షమించి వదిలేసారు అంటూ చెప్పారు.