బిగ్ బాస్ సీజన్ 5 లో నాగార్జున సందడి మొదలైంది. ఈ రోజు టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ రియాల్టీ షోలో మొత్తం ఏడుపులే కనిపిస్తున్నాయి. సరయు, సిరి మధ్య పెద్ద యుద్దమే జరిగింది. నాగార్జున అక్కడ నుంచి మాట్లాడుతున్నా ఎవరికి వారు తిట్ల పురాణం మొదలుపెట్టుకొని వాళ్ల పని వాళ్లు కానిచ్చేశారు. తాజాగా మరో ప్రోమో విడుదలైంది. అందులో ఏముందంటే.. మొదట వాళ్లకు ఒక చిన్న టాస్క్ ఇస్తారు నాగార్జున.
అదేంటంటే.. ‘ఎవరితో సెట్టు.. ఎవరితో కట్టు’ అనేది ఇచ్చారు. మొదట శ్వేత అనీ మాస్టర్ ను చూస్తే.. చనిపోయిన మా అమ్మ గుర్తకు వచ్చిందంటూ.. అనీ మాస్టర్ తో సెట్టు అంటూ.. శ్వేత భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత సింగర్ శ్రీరామ్ శ్వేతతో సెట్ అని.. కాజల్ కట్ అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత సరయు విషయానికి వస్తే.. సిరిపై తీవ్రంగా విరుచుకుపడింది.
ఆటలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఆడాలి.. ఎవరు కోపరేషన్ లేకపోయినా ఆడటం అనేది కష్టం అంటూ సిరితో కట్ అని చెబుతుంది. తనకు ఎవరి సహకారం లేదు కాబట్టి కెప్టెన్ కాలేకపోయానని.. మీరు ఎవరి సహకారం లేకుండా ఆడి చూపించు అంటూ సిరితో కోపంగా అంటుంది సరయు. తనను గెలిపించమని ఏ రోజైనా చెప్పానా నేను అంటూ సిరి తీవ్రంగా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది కూడా.
అది చూసిన నాగార్జున ఇది కెప్టెన్సీ టాస్క్ కాదు.. దీని వెనుక ఏదో జరిగిందంటూ ఆరా తీస్తారు. వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. దీంతో నాగార్జును కొద్దిసేపు షాక్ అయ్యారు. అయితే ఈ ప్రోమో విపరీతంగా వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…