Categories: FeaturedMovie News

స్పోర్ట్స్ బైక్స్ బ్యాన్ చేయాలి.. అంటూ సాయి తేజ్ ప్రమాదం పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు నరేష్..!

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వార్త తెలియడంతో మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆయన బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్ ను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇదిలా ఉండగా సాయి తేజ్ ప్రమాదంపై నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నటుడు నరేష్ కొడుకు నవీన్ సాయి తేజ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులను, ప్రతిరోజు వీరు ఏదో ఒక సందర్భంలో కలుస్తూనే ఉంటారని తెలిపారు. ఈ క్రమంలోనే తన కొడుకు నవీన్,సాయి ధరమ్ తేజ్ బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమని వీళ్లు ఎన్నోసార్లు రేసింగ్ లో పాల్గొన వద్దని వీరిని వారించానని, నిన్న కూడా సాయి ధరమ్ తేజ్ తన కొడుకు మరొక వ్యక్తి ముగ్గురు కలిసి ఏదో ఓపెనింగ్ కు వెళుతున్న సమయంలో బైక్ పై ప్రయాణించడం మంచిది కాదని హెచ్చరించేలోగా అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలిపారు.

తన కొడుకు నవీన్, సాయి తేజ్ దగ్గర 1000 సిసి స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయని.. అలాంటి వాటిని రోడ్డుమీదికి తీసుకువచ్చేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని అసలు మన దగ్గర అంత సీసీ స్పోర్ట్స్ బైక్స్ ను బ్యాన్ చేయాలని నటుడు నరేష్ ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో మరణించారనీ,ఇకపై ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే పూర్తిగా స్పోర్ట్స్ బైక్స్ బ్యాన్ చేయాలని నరేష్ కోరారు.

సాయి ధరమ్ తేజ్, తన కుమారుడు నవీన్ లకు ఏదో క్లబ్ ఉందని అక్కడ వీరందరూ బైక్ రేసింగ్ లు చేస్తారంటూ వారి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సాయి తేజ్ తన కొడుకు లాంటి వాడేనని ఈ ప్రమాదం నుంచి సాయి తొందరగా కోలుకొని ఎప్పటిలాగే సినిమా షూటింగ్లో పాల్గొంటారని నరేష్ సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago