Featured

సాయి ధరమ్ తేజ్ మొదటి సారి పవన్ దగ్గరకు బండి తీసుకెళ్లినప్పుడు.. ఆయన ఏమన్నారో తెలుసా?

సాయి ధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో కేబుల్ బ్రిడ్జి – ఐకియా సమీపంలో బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వైద్యులు అతనిని వెంటిలేటర్ పై ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యారన్న విషయం తెలియగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆస్పత్రికి వెళ్లి అతనిని పరామర్శించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కు స్వయానా మేనమామ. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. సాయి తేజ్ చిన్నప్పటినుంచి బైక్ అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే గతంలో సాయి ధరమ్ తేజ్ ఇంటర్వ్యూ మామయ్యతో తనకున్న అనుబంధం బైక్ నడిపే విషయంలో తనకు హెచ్చరించిన విషయాలను పంచుకున్నారు.

ఐదు సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడిన విషయాలకు సంబంధించిన వీడియోను ప్రస్తుతం మెగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ కు బైక్ అంటే ఇష్టం ఉండడంతో అతను సంపాదించిన మొదటి డబ్బుతో ముందుగా హర్లీ డేవిడ్​ సన్​ బైకు కొని ఆ బండిని పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకు వెళ్లినట్లు తెలిపారు.

కొత్త బండిని చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు అడిగిన మొదటి ప్రశ్న విని సాయి తేజ్ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. బండిని చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఏరా.. హెల్మెట్ కొన్నావా అని అడిగగా.. ముందుగా కొన్నది అదేనని చెప్పారట ఎక్కువ వేగంగా బండి నడవదని తన మామయ్య తనకు హెచ్చరించినట్టు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సాయి తేజ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago