సాయి ధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో కేబుల్ బ్రిడ్జి – ఐకియా సమీపంలో బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వైద్యులు అతనిని వెంటిలేటర్ పై ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యారన్న విషయం తెలియగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆస్పత్రికి వెళ్లి అతనిని పరామర్శించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కు స్వయానా మేనమామ. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. సాయి తేజ్ చిన్నప్పటినుంచి బైక్ అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే గతంలో సాయి ధరమ్ తేజ్ ఇంటర్వ్యూ మామయ్యతో తనకున్న అనుబంధం బైక్ నడిపే విషయంలో తనకు హెచ్చరించిన విషయాలను పంచుకున్నారు.

ఐదు సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడిన విషయాలకు సంబంధించిన వీడియోను ప్రస్తుతం మెగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ కు బైక్ అంటే ఇష్టం ఉండడంతో అతను సంపాదించిన మొదటి డబ్బుతో ముందుగా హర్లీ డేవిడ్ సన్ బైకు కొని ఆ బండిని పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకు వెళ్లినట్లు తెలిపారు.
కొత్త బండిని చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు అడిగిన మొదటి ప్రశ్న విని సాయి తేజ్ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. బండిని చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఏరా.. హెల్మెట్ కొన్నావా అని అడిగగా.. ముందుగా కొన్నది అదేనని చెప్పారట ఎక్కువ వేగంగా బండి నడవదని తన మామయ్య తనకు హెచ్చరించినట్టు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సాయి తేజ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




























