Featured

Hero Raviteja : బోనులో నిలబెట్టి రవితేజను ప్రశ్నలతో టెన్షన్ పెట్టిన యాంకర్ సుమ… ఇంతకీ మ్యాటర్ ఏంటంటే…!

Hero Raviteja : మాస్ రాజా రవితేజగా తెలుగు ప్రేక్షకులు అభిమానంగా పిలుచుకునే రవితేజ మళ్ళీ చాలా రోజులకు ‘ధమాకా’ సినిమతో మంచి సాలిడ్ హిట్ అందుకున్నారు. అలాగే చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న వాల్తేరు వీరయ్య సినిమా కూడా మంచి హిట్ అయింది. అసలు హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలను తీసే రవితేజ ఈ రెండు సినిమాల తరువాత అపుడే మరో సినిమాతో రెడీగా ఉన్నారు. అదే రావణాసుర. ఈ సినిమాలో ఒక న్యాయవాదిగా రవితేజ కనిపించనున్నాడు. ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ సుధీర్ వర్మ.

ప్రమోషన్స్ లో సుమ తో అల్లరి చేసిన రవితేజ…

ఇక మేఘా ఆకాశ్‌, అనూ ఇమ్మాన్యుయేల్, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక సుశాంత్ ఈ సినిమాలో నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ సుధీర్ వర్మతో కలిసి హీరో రవితేజ పలు కార్యక్రమాలలో పాల్గొంటుండగా తాజాగా సుమ తో ఒక ప్రోగ్రామ్ చేసారు.

అందులో సుమ న్యాయవాదిగా రవితేజ, సుధీర్ వర్మను బోనులో నిలబెట్టి సినిమాకు సంబందించిన ప్రశ్నలను వేశారు. సుమ ఎంత తిప్పి తిప్పి ప్రశ్నలు వేసినా సినిమా గురించి కథ గురించి ఒక్క లీక్ కూడా సుధీర్ వర్మ, రవితేజ ఇవ్వలేదు. ఇక సినిమాలో ఫరియా మా ఫేవరేట్ అంటూ డైరెక్టర్ చెప్పగా రవితేజ తాను నాకంటే హైట్ ఉంటుంది టీవీ టవర్ లాగా ఉంటుంది అంటూ సరదాగా చెప్పారు. ఏప్రిల్ 7వ తేదీన సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago