Hero Raviteja : మాస్ రాజా రవితేజగా తెలుగు ప్రేక్షకులు అభిమానంగా పిలుచుకునే రవితేజ మళ్ళీ చాలా రోజులకు ‘ధమాకా’ సినిమతో మంచి సాలిడ్ హిట్ అందుకున్నారు. అలాగే చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న వాల్తేరు వీరయ్య సినిమా కూడా మంచి హిట్ అయింది. అసలు హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలను తీసే రవితేజ ఈ రెండు సినిమాల తరువాత అపుడే మరో సినిమాతో రెడీగా ఉన్నారు. అదే రావణాసుర. ఈ సినిమాలో ఒక న్యాయవాదిగా రవితేజ కనిపించనున్నాడు. ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ సుధీర్ వర్మ.

ప్రమోషన్స్ లో సుమ తో అల్లరి చేసిన రవితేజ…
ఇక మేఘా ఆకాశ్, అనూ ఇమ్మాన్యుయేల్, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక సుశాంత్ ఈ సినిమాలో నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ సుధీర్ వర్మతో కలిసి హీరో రవితేజ పలు కార్యక్రమాలలో పాల్గొంటుండగా తాజాగా సుమ తో ఒక ప్రోగ్రామ్ చేసారు.

అందులో సుమ న్యాయవాదిగా రవితేజ, సుధీర్ వర్మను బోనులో నిలబెట్టి సినిమాకు సంబందించిన ప్రశ్నలను వేశారు. సుమ ఎంత తిప్పి తిప్పి ప్రశ్నలు వేసినా సినిమా గురించి కథ గురించి ఒక్క లీక్ కూడా సుధీర్ వర్మ, రవితేజ ఇవ్వలేదు. ఇక సినిమాలో ఫరియా మా ఫేవరేట్ అంటూ డైరెక్టర్ చెప్పగా రవితేజ తాను నాకంటే హైట్ ఉంటుంది టీవీ టవర్ లాగా ఉంటుంది అంటూ సరదాగా చెప్పారు. ఏప్రిల్ 7వ తేదీన సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.































