Featured

Hero Sai Dharam Tej : పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్…నాలుగు పెళ్లిళ్లు.. వీకెండ్ పొలిటిషియన్ అనే కామెంట్స్ కి సాయి ధరమ్ తేజ్ రియాక్షన్…!

Hero Sai Dharam Tej : మెగా అల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి లాగానే డాన్స్ లో గ్రేస్ చూపుతూ అచ్చం మావయ్య లా డాన్స్ చేసే అల్లుడు అని అనిపించుకున్నాడు. ఇక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం అంటూ వరుసగా హిట్స్ అందుకున్న ఆపైన కొంత తడబడ్డాడు. ఇక యాక్సిడెంట్ తరువాత గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ సినిమాల్లో మళ్ళీ నటిస్తాడా లేదా అనే అనేక అనుమానల మధ్యలో మళ్ళీ వచ్చి వీరుపాక్ష సినిమాతో మంచి హిట్ అందుకుని సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక ఇపుడు వీరుపాక్ష సక్సెస్ తరువాత మళ్ళీ బ్రో అంటూ వచ్చేసాడు. ఈ సారి తన మావయ్య పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సాయి ఆ సినిమా విశేషాలను ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

మావయ్యని ఎవరైనా ఏమైనా అంటే…

పవన్ కళ్యాణ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో వారహి యాత్ర ద్వారా పార్టీ కి జోష్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తన అల్లుడితో కలిసీ అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి వైసీపీ చేస్తున్న రాజకీయ విమర్శలకు గురించి సాయి ధరమ్ తేజ్ కు ప్రశ్న ఎదురైంది.

మీరు దైవం గా భావించే మావయ్యని రకరకాలుగా విమర్శిస్తున్నపుడు మీకు ఏమనిపిస్తుంది అనే ప్రశ్నకు మావయ్య రాజకీయాల్లోకి వచ్చే ముందే మమ్మల్ని అందరిని పిలిచి మాట్లాడారు. నేను పాలిటిక్స్ లోకి వెళుతున్న, వెళ్ళాక చాలా మంది నా మీద బురద జల్లుతారు అవన్నీ మీరు పట్టించుకోకండి. అనాలోచితంగా మాట్లాకండి అని పవన్ చెప్పారంటు సాయి ధరమ్ తేజ్ తెలిపారు. మావయ్యని ఎవరైనా అంటున్నపుడు బాధగా అనిపిస్తుంది కానీ ఏదో ఒకటి మాట్లాడి ఆయనకు ఇబ్బంది కలిగించకూడదని ఆలోచిస్తాం అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

18 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

18 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

18 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

18 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

19 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

19 hours ago