హీరో శ్రీకాంత్ ఇంట విషాదం నెలకొంది. శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు (70) ఆదివారం అర్ధరాత్రి స్టార్ హాస్పిటల్ లో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్న అయన ఆదివారం రాత్రి తుది శ్వాసవిడిచారు. అయన గత నాలుగు నెలల నుండి స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ వార్త తెలుసుకున్న వెంటనే పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు శ్రీకాంత్ ఇంటికి చేరుకొని పరామర్శించారు. ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో 1948 మర్చి 16న జన్మించిన మేక పరమేశ్వరావు. ఆ తరువాత కర్ణాటకలోని గంగావతికి వలసవెళ్లారు. అయన భార్య పేరు ఝాన్సీ లక్ష్మి. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్. హీరో శ్రీకాంత్ కూడా గంగావతిలోనే జన్మించాడు. కర్ణాటక విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేసాడు శ్రీకాంత్. ఆ తరువాత సినిమాలపై మక్కువతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి ఉష కిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎంకౌంటర్ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీకాంత్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “తాజ్ మహల్” చిత్రంతో హీరోగా వచ్చారు. ఆ చిత్రం అయన కెరీర్లో ఈ చిత్రం కీలక మైన మలుపు తిరిగింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…