Categories: Featured

పెళ్లి తర్వాతనే సినిమా అవకాశాలు వచ్చాయి.. ఆసక్తికర విషయాలు చెప్పిన హీరో సుహాస్..!

సుహాస్ పేరంటే చాలామందికి తెలియదు. ఎందుకంటే అతడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ తన కెరీర్ ను మొదలు పెట్టాడు. అరకోర సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ అతడు హీరోగా నటించి సినిమా ‘కలర్ ఫొటో’. దీని ద్వారా అతడంటే అందరికీ తెలిసింది. హీరోగా కూడా తను విజయం సాధించారు. క‌ల‌ర్ ఫొటో సినిమాలో సుహాస్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు హీరోగా, న‌టుడిగా ఫుల్ బిజీగా ఉన్నారు ఈ కుర్ర హీరో.

తాజాగా ఆయన మాడ్లాడుతూ.. ఓ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కలర్ ఫోటోతో హీరో అయ్యా. హీరోగా చేస్తూ… మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా చేస్తాను అన్నారు. ప్రస్తుతం అతడు ఆరు సినిమాలు చేస్తున్నాడని.. అందులో ఐదింటిలో లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు చెప్పాడు సుహాస్. అతడు షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తున్న సమయంలో అతడికి కొంతమంది దర్శకులు పరిచయం అయ్యారు.. ప్రస్తుతం అతడు వారితోనే సినిమాలు చేస్తున్నట్లు తెలిపాడు. హీరోగా చేస్తున్నప్పుడు భయంగా ఉంటుందని.. కొత్తగా ఇండస్ట్రీలో వచ్చి చేసే వారికి కచ్చితంగా ఉంటుందన్నారు.

నేడు (ఆగస్టు 19) తన పుట్టిన రోజు చాలా స్పెషల్ అంటూ చెప్పాడు. తన స్నేహితులతోనే ఇప్పుడు సినిమాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ల‌క్కీగా నా చుట్టూ ఉన్న‌వాళ్లెవ‌రూ మార‌లేదు అని నవ్వుతూ అన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు సహకరిస్తున్నారని.. అందులో ముఖ్యంగా నాని అన్న‌, విజ‌యన్న‌, శివ‌న్న‌, నాగ‌చైత‌న్య‌గారు, స‌మంత‌గారు, బ్ర‌హ్మాజీగారు ఉన్నారన్నారు. అలాగే తన త‌ల్లిదండ్రులు, భార్య‌, స్నేహితులు .. ఇప్పుడు కాస్త సెటిల్ అయ్యాన‌ని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు తెలిపాడు.

తన భార్య తనకు ఎంతో కలసి వచ్చిందని.. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాతే సినిమాల్లో అవ‌కాశం వ‌చ్చిందని ఎంతో ఎమోషనల్ అయ్యారు సుహాస్. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఇప్పుడిప్పుడే ఫలితం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లికి అతిథిలా వచ్చి 4 లక్షలతో మాయం.. జైపూర్‌లో రిసెప్షన్‌లో దొంగతనం కలకలం

ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…

3 minutes ago

బంగారం, వెండిలో ట్రేడింగ్ సులువు…పెట్టుబడిదారులకు శుభవార్త!

అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…

15 minutes ago

ప్రపంచ కుబేరుల టేబుల్ సీక్రెట్స్.. మీరు ఊహించని ఆహార అలవాట్లు

బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…

27 minutes ago

ఫాస్ట్ ఫుడ్ షాక్.. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తినే ముందు ఇది చదవండి.!

ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫాస్ట్…

31 minutes ago

అవసరానికి మించి నిద్రపోకండి… ఇవే మీ శరీరానికి వచ్చే ప్రమాదాలు!

అవసరానికి మించిన నిద్ర తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం.…

39 minutes ago

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో కొత్త మలుపు… ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను ఏ-2గా చేర్చిన సిట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…

57 minutes ago