సుహాస్ పేరంటే చాలామందికి తెలియదు. ఎందుకంటే అతడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ తన కెరీర్ ను మొదలు పెట్టాడు. అరకోర సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ అతడు హీరోగా నటించి సినిమా ‘కలర్ ఫొటో’. దీని ద్వారా అతడంటే అందరికీ తెలిసింది. హీరోగా కూడా తను విజయం సాధించారు. కలర్ ఫొటో సినిమాలో సుహాస్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు హీరోగా, నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నారు ఈ కుర్ర హీరో.

తాజాగా ఆయన మాడ్లాడుతూ.. ఓ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కలర్ ఫోటోతో హీరో అయ్యా. హీరోగా చేస్తూ… మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తాను అన్నారు. ప్రస్తుతం అతడు ఆరు సినిమాలు చేస్తున్నాడని.. అందులో ఐదింటిలో లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు చెప్పాడు సుహాస్. అతడు షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తున్న సమయంలో అతడికి కొంతమంది దర్శకులు పరిచయం అయ్యారు.. ప్రస్తుతం అతడు వారితోనే సినిమాలు చేస్తున్నట్లు తెలిపాడు. హీరోగా చేస్తున్నప్పుడు భయంగా ఉంటుందని.. కొత్తగా ఇండస్ట్రీలో వచ్చి చేసే వారికి కచ్చితంగా ఉంటుందన్నారు.
నేడు (ఆగస్టు 19) తన పుట్టిన రోజు చాలా స్పెషల్ అంటూ చెప్పాడు. తన స్నేహితులతోనే ఇప్పుడు సినిమాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. లక్కీగా నా చుట్టూ ఉన్నవాళ్లెవరూ మారలేదు అని నవ్వుతూ అన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు సహకరిస్తున్నారని.. అందులో ముఖ్యంగా నాని అన్న, విజయన్న, శివన్న, నాగచైతన్యగారు, సమంతగారు, బ్రహ్మాజీగారు ఉన్నారన్నారు. అలాగే తన తల్లిదండ్రులు, భార్య, స్నేహితులు .. ఇప్పుడు కాస్త సెటిల్ అయ్యానని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు తెలిపాడు.
తన భార్య తనకు ఎంతో కలసి వచ్చిందని.. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాతే సినిమాల్లో అవకాశం వచ్చిందని ఎంతో ఎమోషనల్ అయ్యారు సుహాస్. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఇప్పుడిప్పుడే ఫలితం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.
































