Hero Sumanth : అక్కినేని నట వారసుడిగా ఆయన పోలికలతో ఇండస్ట్రీకి పరిచయమైన సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నా మంచి హిట్లనైతే సంపాదించుకోలేదు. అక్కినేని గ్లామర్, నటన రెండూ ఉన్నా కథల ఎంపికలో తడబడి సినిమా ఇండస్ట్రీలో నిలాదొక్కుకోలేదు. ఈ మధ్య కాలంలో అడపా దడపా క్యారెక్టర్ రోల్స్ అలానే హీరోగా కథ నచ్చినట్టు సినిమాలను చేస్తూ అలరిస్తున్న సుమంత్ తన తాత బయో పిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేసారు.
బయోపిక్ నేనే చేయాలి… మేమంతా ఒక జనరేషన్…
ఇటీవల ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ ఏఎన్ఆర్ బయో పిక్ గురించి ప్రశ్న ఎదురుకాగా నేనే చేయాలి, నాకు అనుభవం కూడా ఉంది అంటూ చెప్పారు సుమంత్. మహానాయకుడు, కథనాయకుడు సినిమాల్లో నాగేశ్వరావు గారి లాగా సుమంత్ కనిపించారు. అయితే వయసు రీత్యా బయో పిక్ లో నాగేశ్వరావు గారిని చూపించాలని అనుకున్నపుడు నాగార్జున గారు నేను, నాగచైతన్య చేస్తే బాగుంటుంది అంటూ చెప్పారు.
ఇక ఈ జనరేషన్ లో నచ్చిన నటుడు ఎవరంటే జనరేషన్ అంటే ఎవరు, అందులో ఉన్నది ఏ హీరోలో చెప్పాలి. ఎందుకంటే నేను, మహేష్, పవన్, ఎన్టీఆర్ ఒక జనరేషన్ వాళ్లం అంటూ చెప్పారు. నాకు మా జనరేషన్ లో మహేష్ నచ్చుతాడు. మహేష్ కాకుండా అంటే ఎన్టీఆర్ నటన నచ్చుతుంది, తాను ఆల్ రౌండర్ తన సినిమాలను చూస్తుంటాను అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…