Featured

Senior actor Kota Srinivasa rao : ఎన్టీఆర్ కి పోటీ లేరు… ఎవరూ రారు…: సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ రావు

Senior actor Kota Srinivasarao : విలనిజంలో కొత్త స్టైల్ చూపిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆయన కమెడియన్ గానూ విలన్ గానూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఇలా ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రల్లో ఒదిగిపోయి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనస్సులో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక కోటా గారు సినిమాల్లోకి వచ్చేకన్నా ముందే బ్యాంకులో ఉద్యోగిగా ఉండేవారు. కొన్నేళ్లు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే సినిమాలను చేస్తూ రెండింటి మీద ప్రయాణం చేసారు. ఇక సినిమాల్లో మెల్లగా స్థిరపడిపోయాక ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాల్లో నటించారు. అలా సౌత్ భాషలలో నటించిన ఆయన ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సినిమాల్లో నటించడం లేదు. అయితే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆయన సినిమా కెరీర్ విశేషాలను చెబుతుంటారు.

నాకు ఇష్టమైన నటుడు ఎన్టీఆర్…

కోటా శ్రీనివాస రావు గారు ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సినిమాల గురించి ప్రస్తుతం ఉన్న నటుల గురించి పలు ఇంటర్వ్యూలలో మాట్లాడారు. ఇపుడున్న హీరోలలో తనకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం అంటూ చెప్పారు. ఇపుడున్న హీరోలలో ఎన్టీఆర్, మహేష్, బన్నీ ఇలా వీళ్లందరూ నటనలో బాగా నచ్చుతారు అయితే ఎన్టీఆర్ లో ఉన్న పోటెన్షియాలిటీ ఇంకెవరిలోనూ లేదు.

డాన్స్, నటన, డైలాగు డెలివరీ, వాక్చాతుర్యం ఇలా అన్నింటిలోనూ ఎన్టీఆర్ కి పోటీ ఎవరూ లేరు. ఇకముందు కూడా రాలేరు. వాళ్ళ తాతగారి నటన పునికి పుపూచ్చుకున్నాడు కాబట్టే ఎన్టీఆర్ అనే పేరు తెచ్చుకున్నాడు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago