టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకరు. అగ్ర హీరోలందరితో నటించిన అనుభవం ఆమెది. అందానికి తగ్గ అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చిరుతో సమానంగా స్టెప్పులేసి అలరించింది. అందుకే టాలీవుడ్ లో రంభ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దశాబ్థ కాలం పాటు లీడింగ్ లేడీగా దూసుకుపోయింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాల,భోజ్ పూరి భాషల్లో నటించింది. రీసెంట్ గా తారక్, బన్నీ చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి మెరుపులు మెరిపించింది.
తెలుగు చిత్రరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రంభ 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్‌ను మ్యారేజ్ చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ మాజీ హీరోయిన్ 2016లో తన భర్త నుండి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసును పరిశీలించిన కోర్టు ఇద్దరూ కలిసి ఓ అవగాహనకు రావాలంటూ సూచన చేయడంతో ఇద్దరు కలిసి కొత్త జీవితం గడుపుతున్నారు. జూన్ 5 న తన 44వ పుట్టినరోజును భర్త, పిల్లలతో కలిసి జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి.
కాగా తన బర్త్ డే రోజున భర్త, పిల్లలతో చాలా సంతోషంగా గడిపానని ఈ బ్యూటీ క్వీన్ వెల్లడించింది. పుట్టినరోజు సందర్భంగా రంభ అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడకు చెందిన రంభ, ఇవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైందన్న విషయం తెలిసిందే.! చాలా రోజల తర్వాత రంభని కాస్త కొత్త లుక్‌లో చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…