టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకరు. అగ్ర హీరోలందరితో నటించిన అనుభవం ఆమెది. అందానికి తగ్గ అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చిరుతో సమానంగా స్టెప్పులేసి అలరించింది. అందుకే టాలీవుడ్ లో రంభ స్టార్  హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దశాబ్థ కాలం పాటు లీడింగ్ లేడీగా దూసుకుపోయింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాల,భోజ్ పూరి భాషల్లో నటించింది. రీసెంట్ గా తారక్, బన్నీ చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి మెరుపులు మెరిపించింది.

తెలుగు చిత్రరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రంభ 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్‌ను మ్యారేజ్ చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ మాజీ హీరోయిన్ 2016లో తన భర్త నుండి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసును పరిశీలించిన కోర్టు ఇద్దరూ కలిసి ఓ అవగాహనకు రావాలంటూ సూచన చేయడంతో ఇద్ద‌రు క‌లిసి కొత్త జీవితం గ‌డుపుతున్నారు. జూన్ 5 న తన 44వ పుట్టినరోజును భర్త, పిల్లలతో కలిసి జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా, అవి వైర‌ల్ అయ్యాయి.

కాగా తన బర్త్ డే‌ రోజున భర్త, పిల్లలతో చాలా సంతోషంగా గడిపానని ఈ బ్యూటీ క్వీన్ వెల్లడించింది. పుట్టినరోజు సందర్భంగా రంభ అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడకు చెందిన రంభ, ఇవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైందన్న విషయం తెలిసిందే.! చాలా రోజల త‌ర్వాత రంభ‌ని కాస్త కొత్త లుక్‌లో చూసి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here