డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ పట్టుబడకుండా ఉండటం కోసం దుండగులు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇదివరకు ఈ విధంగా మాదకద్రవ్యాలను ఎన్నో రకాలుగా రవాణా చేస్తూ అధికారులకు పట్టుబడిన దుండగులు తాజాగా మరోసారి హెరాయిన్ ను గాజులలో రవాణా చేస్తున్నట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ హెరాయిన్ విలువ సుమారు 7.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలియజేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హెరాయిన్ ను సన్నని పైపులలోకి పెట్టి వాటిని గాజులు లాగా చుట్టి రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ హెరాయిన్ ను దక్షిణాఫ్రికా నుంచి డిల్లీలోని ఓ చిరునామాకు దిగుమతి చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలోనే వీటికి సంబంధించిన ఫోటోలను కస్టమ్స్ అధికారులు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
ఈ క్రమంలోనే అధికారులు మాట్లాడుతూ గత వారంలో దక్షిణాఫ్రికా దేశస్తులు ఏకంగా 126 కిలోల హెరాయిన్‌ను స్మగ్లింగ్ చేస్తూ దిల్లీ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ విధంగా హెరాయిన్‌ను గాజులలో పెట్టె స్మగ్లింగ్ చేస్తున్న పార్సిల్ ను అధికారులు గుర్తించి అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఫోటోలు చూసిన నెటిజన్లు వీళ్ళ తెలివి మామూలుగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…