Featured

Heroine Amani : నాన్నని చివరి చూపు కూడా చూసుకోలేక పోయాను… ఆరోజు చాలా బాధపడ్డాను…: హీరోయిన్ ఆమని

Heroine Amani : ‘జంబలకిడి పంబ’ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో అడుగుపెట్టిన ఆమని ఆ తరువాత మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం వంటి నటించేందుకు స్కోప్ ఉన్న పాత్రలతో ఒదిగిపోయి నటించి సగటు తెలుగింటి మహిళగా అందరి మదిలో నిలిచిపోయింది. హీరోయిన్ గా దాదాపు అందరు హీరోలతో నటించిన ఆమని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. ఇక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఆ నలుగురు’ సినిమాలో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అలరిస్తున్నారు. తన పాత సినిమా విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నాన్న చివరి చూపు దక్కలేదు…

హీరోయిన్ అవ్వాలనుకున్నప్పుడు మొదట్లో తండ్రి ఒప్పుకోకపోవడం, ఆ తరువాత కొద్దిగా అవకాశాలు వచ్చిన తరువాత ఆమని తండ్రి కూతురుకి నిజంగానే సినిమాల్లో నటించాలనే పట్టుదలను చూసి ఆమెను ఎంకరేజ్ చేశారట. ఇక తన తండ్రితో ఎక్కువ బాండింగ్ ఉండేదంటూ చెప్పిన ఆమని జీవితంలో బాగా బాధించిన విషయం తండ్రి మరణించినపుడు అంటూ చెప్పారు. ఆమని తండ్రికి ఇద్దరు భార్యలు కాగా ఆమని రెండో భార్య కూతురు. ఇంకా హీరోయిన్ గా అప్పుడే అడుగులేస్తున్న సమయంలో తండ్రి అనారోగ్యం పాలవడం తాను అవుట్ డోర్ షూటింగ్ లో ఉన్న సమయంలో తన తండ్రి మరణించడంతో ఆ విషయం కూడా ఎవరూ చెప్పకపోవడం వల్ల ఆఖరి చూపుకు నోచుకోలేదట.

తమిళ సినిమా షూటింగ్ సమయంలో ఫోన్ ద్వారా తండ్రి చనిపోయిన విషయం చెప్పినా చిత్ర యూనిట్ విషయం తెలిస్తే వెళ్ళిపోతుందని క్లైమాక్స్ సీన్ షూటింగ్ ఉండటంతో దాచిపెట్టారట. విషయం ఆలస్యంగా తెలియడంతో చెన్నై వెళ్లి అక్కడి నుండి బెంగళూరు వెళ్లే సరికి ఒకటిన్నర రోజు అయిపోవడంతో నాన్న అంతిమ సంస్కారాలు జరిగిపోయాయి. చివరిసారిగా నాన్నను నేను, అమ్మా చూడలేకపోయామనే బాధ బాగా వేదించింది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago