Featured

Pop Singer Smitha : నా భర్తని నా ఫ్రెండ్స్ అందరూ బావ అని పిలుస్తారు…: పాప్ సింగర్ స్మిత

Pop Singer Smitha : తెలుగులో మొట్ట మొదట పాప్ గాయనిగా తన కెరీర్ ప్రారంభించింది స్మిత. ఈటీవీ లో పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా కెమరా ముందుకు వచ్చింది. 2000 సంవత్సరంలో పాప్ గాయనిగా ‘హై రబ్బా’ ఆల్బమ్ తో మంచి విజయాన్ని అందుకుంది. తరువాత వెను దిరిగి చూసుకునే పని లేకుండా వరుస విజయాలతో ముందుకు వెళ్ళింది. గాయని గానే కాకుండా మల్లీశ్వరి, ఆట సినిమాలలో నటించింది స్మిత. తెలుగు సినిమాలలో ప్లే బ్యాక్ సింగర్ గానే కాకుండా స్మిత వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇషా సంస్థలో వాలంటీర్ గా సేవలు అందిస్తోంది. మరోవైపు ఈ మధ్యనే మరోసారి టాక్ షో తో సందడి చేస్తోంది.

నా భర్తని నా ఫ్రెండ్స్ అంతా బావ అనే అంటారు…

స్మిత చిన్న వయసులోనే పాప్ సింగర్ గా ఎదిగి ఆ పైన ప్లే బ్యాక్ సింగర్ గా ఎన్నో పాటలను పాడారు. అవే కాకుండా సొంత వ్యాపారంలోనూ ఉన్న స్మిత తన వ్యక్తిగత జీవితం, భర్త, పాప గురించి రిసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భర్త శశాంక్ తో తన వివాహం గురించి మాట్లాడుతూ వారిది ప్రేమ వివాహం అని అయితే మొదట ఇద్దరిలో ఎవరు ప్రపోజ్ చేసుకున్నారు అనేది మాకే తెలియదని, మా కామన్ ఫ్రెండ్స్ అందరం తనని బావ అని పిలిచేవాళ్లం అంటూ చెప్పారు.

నా ఫ్రెండ్ బావ అవడం వల్ల మొత్తం ఫ్రెండ్స్ అంతా అలానే పిలుస్తామని, ఇప్పటికీ అలానే బావ అని పిలుస్తున్నట్లు తెలిపారు. అలా నా ఫ్రెండ్స్ అంతా కూడా ఇప్పటికీ నా భర్తను బావ అనే పిలుస్తారు అంటూ చెప్పారు. ఇక తాను వ్యాపారం చేసుకుంటున్న తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని, నేను పాడుతుంటే ఇంకా ఇష్టం అంటూ స్మిత తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago