Heroine Laya : తన సహజ నటనతో గుర్తింపు తెచ్చుకుని తెలుగు అమ్మాయి అయినా కూడా మంచి అవకాశాలతో దుసుకుపోయిన నటి లయ. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూనే మంచి సినిమాలలో నటించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపునందుకున్న లయ పెళ్లి తరువాత సినిమాలకు దూరమైంది. చాలా కాలం తరువాత సోషల్ మీడియాలో సందడి చేస్తున లయ మళ్ళి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. అప్పటి సినిమా అనుభవాలను సీనియర్ ఆర్టిస్టులతో ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్న లయ తనను ఇబ్బందిపడిన షూటింగ్స్ కూడా తెలిపారు.
ఏనుగు తొక్కేసేది… విజయశాంతి ఏం చేసారంటే…
లయ తెలుగుతో పాటు కన్నడ, తమిళం వంటి ఇతర భాషలలో కూడా సినిమాలను చేసారు. అలా చేస్తున్న సమయంలో తమిళంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతితో కలిసి నటించిన ఒక సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటనలను తెలిపారు. ‘మహా చండి’ గా తెలుగులో డబ్ అయిన ఆ సినిమాలో విజయశాంతి అమ్మవారిగాను ఆమె భక్తురాలిగా లయ నటించారట. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో ఏనుగు మీదకు ఎక్కే సీన్ లో రిహర్సల్ చేసేటపుడు బాగానే వచ్చినా రియల్ గా సీన్ చేసేటపుడు ఏనుగు కిందకు పడేసి కాలితో తొక్కబోయిందంట.
వెంటనే పక్కకు జరిగిన లయ ఏనుగు సీన్ చేయడానికి బాగా భయపడిందట. ఆ తరువాత మళ్ళీ రెండు రోజులకు అదే ఏనుగుతో మళ్ళీ అదే సీన్ షూట్ చేసినపుడు భయపడినా విజయశాంతి గారు ఏం పర్వాలేదు ఏనుగు తొండంను ఇలా అను అని చెప్పి ఫ్రూట్స్ తినిపించమని చెప్పారట. అలా చేసాక ఆ ఏనుగు లయను ఏమీ చేయలేదట. భయపడుతూనే ఆ సీన్ కంప్లీట్ చేశాను అంటూ లయ తన అనుభవాలను పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…