Featured

Heroine Laya : పవన్ కళ్యాణ్ గారు నా పెళ్ళికి వచ్చి భోజనం చేయమంటే… నవ్వి ఏమన్నారంటే…: హీరోయిన్ లయ

Heroine Laya : ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా తొలి అవకాశంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి లయ. తెలుగమ్మాయి అయినా కూడా తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకుని స్వయం వరం, ప్రేమించు అంటూ వరుస హిట్లందుకుంది. అలాగే నంది పురస్కారాలను కూడా అందుకుంది. తన నటనతో ఆందరినీ ఆకట్టుకున్న లయ కెరీర్ బాగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ తరువాత కుటుంబం బాధ్యలకు దగ్గరైన లయ సినిమాలకు దూరమైయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్న లయ ఒకవైపు సోషల్ మీడియాతో అభిమానులకు టచ్ లో ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ చేయాలని అనుకుంటున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన ఫ్యామిలీ గురించి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

పెళ్ళికి వచ్చిన పవన్ కళ్యాణ్…

కెరీర్ ఇంకా ఉండి సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్న సమయంలోనే లయ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయారు. అయితే ఆమె పెళ్ళికి సినిమా ఇండస్ట్రీ నుండి అందరినీ పిలిచిన లయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా పెళ్ళికి పిలిచారట. అప్పాయింట్మెంట్ లేకపోయినా వెంటనే కలిసిన ఆయన పెళ్ళికి రమ్మని పిలిస్తే వస్తానని చెప్పారు, అయితే నిజంగానే వస్తారని అనుకోలేదు అంటూ లయ తెలిపారు.

రిసెప్షన్ సమయానికి ఇంకా అతిధులెవరూ రానప్పుడే పవన్ కళ్యాణ్ గారు వచ్చి విష్ చేసి వెళ్లారు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను ఏదో మామూలుగా వస్తానని చెప్పారు కానీ రారు అనుకున్నాను కానీ ఆయన వచ్చేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. భోజనము చేసి వెళ్ళండని చెప్పాను. ఆయన నవ్వి భోజనము చేసి వెళ్లాలా అంటూ వెళ్లిపోయారు. ఆయన వస్తున్నట్లు ముందుగా ఎవరికీ తెలియదు ఒకవేళ తెలుసుంటే అక్కడ పరిస్థితి వేరేలా ఉండేది. అప్పటికీ ఆయన స్టేజి మీదకు రాగానే హడావిడి జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఆమె జ్ఞాపకాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago