టాలీవుడ్ లో ప్రస్తుతం వైరల్ అవుతున్న హీరో నిఖిల్, నితిన్ పెళ్లి ప్రస్తావనలు. హీరో నిఖిల్ తన బ్యాచులర్ లైఫ్ కి బై బై చెప్పి 5 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న పల్లవి వర్మతో నిశ్చితార్దం చేసుకొని పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్దమవుతున్నాడు. పల్లవి వర్మ వృత్తి రీత్యా డాక్టర్. అయితే ఈ యాక్టర్, డాక్టర్ పెళ్లి ఎప్పుడూ అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరో పక్క టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్లలో హీరో నితిన్ ఒకడు. తాజాగా నితిన్ కూడా వారి ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టి తన ప్రేయసి షాలిని రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. మొన్న ఫిబరవరి 15న వీరిరువురి నిశ్చితార్దం కొందరు సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. నితిన్, షాలినిల వివాహం ఏప్రిల్ 16న దుబాయ్ లో అంగ రంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అయితే తాజాగా హీరో నిఖిల్, పల్లవి పెళ్లి కూడా ఏప్రిల్ 16 నే ఉండనుంది అని అతని సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. కానీ వివాహ వేడుక ఎక్కడ అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. “హ్యాపీడేస్” సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ సిద్దార్ద్. తన హైపర్ యాక్టివ్ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఈ ఇద్దరు టాలీవుడ్ హీరోస్ ఒకే రోజు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దవుతున్నారని వీరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…