Movie News

బిగ్ బాస్ సీజన్ 19లో హిమన్షి నర్వాల్? కన్నీటి కథతో ప్రేక్షకుల మనసు గెలిచేనా?

అమరావతి: బుల్లితెరపై బిగ్ బాస్ జాతర మళ్లీ మొదలుకానుంది. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో, మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో కొత్త సీజన్‌కు సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో హిందీ బిగ్ బాస్ సీజన్ 19లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల జాబితా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

అమరవీరుడి భార్య హిమన్షి

పహల్గామ్‌ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇండియన్ నేవీ ఆఫీసర్‌ వినయ్‌ నర్వాల్‌ భార్య హిమన్షి నర్వాల్‌ ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనబోతున్నారని వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి ప్రేక్షకుల మనసుకు త్వరగా దగ్గరయ్యే వ్యక్తులను ఎంపిక చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హిమన్షిని సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్‌. అయితే, ఈ వార్తపై హిమన్షి లేదా బిగ్ బాస్ టీమ్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కశ్మీర్‌లో విషాదం

2025 ఏప్రిల్‌లో కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, వారిలో హిమన్షి భర్త వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. పెళ్లైన కేవలం రెండు నెలలకే హనీమూన్ కోసం వెళ్లిన ఈ దంపతుల ఆనందయాత్ర, ఉగ్రదాడితో విషాదాంతమైంది. ఈ ఘటన తర్వాత, భర్త మృతదేహం పక్కన కూర్చొని కన్నీళ్లు పెడుతున్న హిమన్షి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ దృశ్యాలు చూసి అనేకమంది భారతీయులు భావోద్వేగానికి గురయ్యారు. హిమన్షి కథ దేశవ్యాప్తంగా ఎంతో మందిని కదిలించింది. అందుకే ఆమెను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

telugudesk

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

9 hours ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

2 days ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

2 days ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

2 days ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

2 days ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

2 days ago