అమరావతి: బుల్లితెరపై బిగ్ బాస్ జాతర మళ్లీ మొదలుకానుంది. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో, మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో కొత్త సీజన్‌కు సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో హిందీ బిగ్ బాస్ సీజన్ 19లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల జాబితా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

అమరవీరుడి భార్య హిమన్షి
పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇండియన్ నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమన్షి నర్వాల్ ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనబోతున్నారని వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి ప్రేక్షకుల మనసుకు త్వరగా దగ్గరయ్యే వ్యక్తులను ఎంపిక చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హిమన్షిని సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయితే, ఈ వార్తపై హిమన్షి లేదా బిగ్ బాస్ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కశ్మీర్‌లో విషాదం
2025 ఏప్రిల్‌లో కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, వారిలో హిమన్షి భర్త వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. పెళ్లైన కేవలం రెండు నెలలకే హనీమూన్ కోసం వెళ్లిన ఈ దంపతుల ఆనందయాత్ర, ఉగ్రదాడితో విషాదాంతమైంది. ఈ ఘటన తర్వాత, భర్త మృతదేహం పక్కన కూర్చొని కన్నీళ్లు పెడుతున్న హిమన్షి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ దృశ్యాలు చూసి అనేకమంది భారతీయులు భావోద్వేగానికి గురయ్యారు. హిమన్షి కథ దేశవ్యాప్తంగా ఎంతో మందిని కదిలించింది. అందుకే ఆమెను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.































