రవితేజ నటించిన ‘భద్ర’ సినిమాను ఎంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేసారో తెలుసా..??

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ‘భద్ర’.. ఈ సినిమాతో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు బోయపాటి.ఇక రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిల్చిన ఈ మూవీ గుంటూరులో రెండు కేంద్రాల్లో 50డేస్ నడిచింది. 90కేంద్రాల్లో 50రోజులు,42కేంద్రాల్లో వంద ఆడింది. 23కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈమూవీ 2005లో టాప్ ఐదు సినిమాల్లో ఒకటిగా నిల్చింది.

తమిళంలో శరవణ గా, కన్నడలో గజగా,బెంగాలీలో జోష్ గా రీమేక్ అయింది. హిందీలో,మళయాళంలలో డబ్ అయింది. రవితేజను మాస్ మసాలా హీరోగా మార్చిన ఈ సినిమా వచ్చి ఈ సంవత్సరం మే12 నాటికి 15ఏళ్ళు పూర్తయ్యాయి..ఇక ఈ సినిమాకి సంబంధించి తెర వెనుక చాలా పెద్ద కథ నడిచిందట.దాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ముత్యాల సుబ్బయ్య దగ్గర ఆరేళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన బోయపాటి శ్రీను తన బంధువు అయిన కొరటాల శివతో కల్సితొలి మూవీ స్టోరీ గా భద్ర రాసుకున్నాడు.

స్క్రిప్ట్ పూర్తయ్యాక పోసాని కృష్ణ మురళి చదివి బాగుందని, సినిమాగా తీస్తే హిట్ అవుతుందని అన్నాడు. అయితే అప్పటికే సాంబ మూవీ షూటింగ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి బోయపాటి స్టోరీ వినిపిస్తే, కొత్త డైరెక్టర్ కదా ఎలా తీస్తాడో ఏమోనని,తర్వాత సినిమా చేద్దాం అని పంపించేశాడు. అయితే బన్నీతో చేద్దామని భావించి అల్లు అరవింద్ ని కలిసాడు. అప్ప్పటీకే ఆర్య మూవీ చేస్తున్న బన్నీ సినిమా పూర్తయ్యేదాకా మరో సినిమా జోలికి వెళ్లేదిలేదని అరవింద్ చెప్పేసారు.

అయితే స్టోరీ బాగా నచ్చిన బన్నీ వెంటనే బోయపాటిని దిల్ రాజు దగ్గరకి తీసుకెళ్లి స్టోరీ చాలా బాగుందని చెప్పడంతో దిల్ రాజు వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసాడు.ప్రభాస్ ని కాంటాక్ట్ చేస్తే,చక్రం మూవీ డేట్స్ ఇవ్వడం వలన ఖాళీ లేదు. దీంతో ఎమోషన్,కామెడీ అన్నిపండించే రవితేజా ఉన్నాడని అతడిని లైన్ లో పెట్టారు. 2004లో అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ స్టార్ట్ చేసారు. హైదరాబాద్ లోని అన్ని స్టూడియోల్లో 80రోజుల్లో సినిమా తీసేసారు. ఐదున్నర కోట్ల బడ్జెట్.2005 మే 2న బన్నీ, ప్రభాస్ చేతులమీదుగా ఆడియో విడుదలై,12వ తేదీన 100ప్రింట్స్ తో మూవీ రిలీజయింది. ఎమోషన్,కామెడీ,నటన అన్నీ కల్సి,అందరినీ థియేటర్స్ కి రప్పించిన భద్ర మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది…!!