Ramcharan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.
ఇలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందింది. ఇక బాలీవుడ్ తారలందరూ కూడా ఈ పెళ్లి వేడుకలలో మూడు రోజుల పాటు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ పెళ్లి వేడుకలలో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేసినందుకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇకపోతే వేదికపై వీరందరూ ఫర్ఫార్మెన్స్ చేసినందుకు మరికొంత మొత్తంలో చార్జ్ చేశారని వార్త పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది.
ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ అమీర్ ఖాన్ ముగ్గురు కలిసి వేదికపై నాటు నాటు స్టెప్పులు వేశారు అనంతరం వీరితో పాటు రామ్ చరణ్ ని కూడా వేదికపైకి పిలిచి మరి అతనితో కలిసి డాన్సులు వేశారు. ఇలా వీరందరూ కలిసి వేదికపై డాన్స్ చేసినందుకు భారీగా తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై నార్త్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఈ వార్తలను కొట్టి పారేశారు. తాము ఈ పెళ్లి వేడుకలను ఎంతో ఎంజాయ్ చేశామని తెలిపారు.
రూపాయి కూడా తీసుకోలేదు…
ఇక తాము డబ్బు తీసుకొని మరి ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేసాము అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని నార్త్ సెలబ్రిటీలు కొట్టి పారేశారు. ఇక రామ్ చరణ్ అయితే కనీసం ఒక రూపాయి కూడా తీసుకోలేదని ఈయన అంబానీ పిలుపుమేరకు పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారని తెలుస్తోంది. ఇలా పెర్ఫార్మెన్స్ చేసినందుకు డబ్బు తీసుకున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని ఈ వార్తలను ఖండిస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…