Crime News: ఇంత దారుణమా..! భర్త లైంగిక దాడి.. భార్య వీడియో చిత్రీకరణ..!
Crime News: దేశంలో లైంగిక దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. తెలిసిన వారే మహిళలు, చిన్నారుల జీవితాన్ని చిదిమేస్తున్నారు. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధుల తీరు మారడం లేదు. ఇదిలా ఉంటే విజయవాడలో జరిగిన అత్యాచార ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
భర్త వేరే వారితో అక్రమసంబంధం కొనసాగిస్తే ఓర్చుకోలేని భార్య… ఈ ఘటనలో భర్తకు సహరించింది. ఏకంగా భర్త అత్యాచారం చేస్తుంటే వీడియో తీసింది. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలన కలిగించింది.
వివరాల్లోకి వెళితే.. విజయవాడలో ఈ అత్యాచార దారుణం చోటుచేసుకుంది. మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా.. వీడియో తీసి బెదిరంచాడు. తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలంటూ బ్లాక్ మెయిల్ చేశారు. దీనంతటికి నిందితుడి భార్య కూడా సహకరించింది.
విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (25) భర్త, పిల్లలతో నివాసం ఉంటోంది. భర్త క్యాటరింగ్ పనులు చేస్తుంటారు. అయితే సదరు మహిళ ఇంటి ముందు దిలీప్, తులసి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే దిలీప్ కన్ను సదరు మహిళపై పడింది. ఆమెను ఎలాగైనా అనుభవించాలని ప్లాన్ వేశాడు. ఈ నెల8 తేదీన రాత్రి దిలీప్, తులసి మహిళ ఇంటికి వెళ్లి బలవంతంగా లాక్కొచ్చారు. దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను తులసి వీడియో తీసి భర్తకు సహకరించింది. మరో రెండు మూడు రోజుల పాటు ఇలాగే బలవంతంగా మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు. చివరకు అత్యాచారం వీడియోను అడ్డం పెట్టుకుని తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలంటూ.. బెదిరించాడు. తన జీవితాన్ని నాశనం చేయవద్దని ఎంత వేడుకున్నా.. దిలీప్ వినలేదు. దీంతో ఏం చేయాలో తెలియక..చివరకు పోలీసులను ఆశ్రియంచింది. చివరకు దిలీప్, తులసిలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో ఇంతటి దారుణం జరగడంతో అంతటా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…