దేశంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్లలో చాలామంది శారీరక శ్రమ లేకపోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. పురుషులు, మహిళలు అనే తేడాల్లేకుండా అందరూ ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది పొట్ట తగ్గించుకోవడానికి వ్యాయామం మాత్రమే చేస్తున్నారు. అయితే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా పెద్దగా ఫలితం ఉండదు. తక్కువ బరువు ఉన్నవాళ్లకు సైతం పొట్ట సమస్య వేధిస్తోంది.
పొట్ట వల్ల కొందరు తక్కువ వయస్సే అయినా పెద్ద వయస్సు వారిలా కనిపిస్తున్నారు. అయితే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా పొట్టను తగ్గించుకోవచ్చు. పొట్ట తగ్గాలంటే జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. చాలమందిలో జంక్ ఫుడ్ వల్లే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. పొట్ట తగ్గాలంటే ఆయిల్ తక్కువగా వినియోగించిన ఆహార పదార్థాలనే ఎక్కువగా తీసుకోవాలి.
రోజులో అరగంట నుంచి గంట సమయం వ్యాయామం చేయడం ద్వారా పొట్టను తగ్గించుకోవచ్చు. బరువులు ఎత్తే వ్యాయామాలను ఎక్కువగా చేస్తే మంచిది. రోజులో కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. తీసుకునే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్ల వాడకాన్ని వీలైనంత తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. అన్నం తక్కువగా తీసుకుంటూ పప్పు, ఆకుకూరలను తీసుకోవాలి.
జొన్నలు, సజ్జలు, గోధుమలతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఈ విధంగా రెండు, మూడు నెలలు తీసుకునే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పొట్ట సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…