General News

పెళ్ళైన 11 నెలలకే గుండెపోటుతో భర్త మృతి.. యువతి షాకింగ్ నిర్ణయం..?

అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంతో, ఏడు అడుగులు నడిచి కష్టసుఖాలలో జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త అర్ధాంతరంగా తనను వదిలి, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే ఆ యువతి బాధ వర్ణనాతీతం. ఈ భూమి పై తన భర్త ఇక లేడు అనే నిజాన్ని నమ్మలేని ఆ భార్య తన భర్త లేని జీవితం తనకు అవసరం లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించిన హృదయ విదారక ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కర్ణాటకలోని మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లికి చెందిన కిరణ్‌ (30), పూజా (22)లకు 11 నెలల క్రితం వివాహం జరిగింది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి వైవాహిక జీవితాన్ని చూసి రెండు కుటుంబాల పెద్దలు ఎంతో సంతోషించేవారు. అయితే ఆ సంతోషం వారిలో ఎక్కువ కాలం నిలవలేదు. వీరి సంతోషం చూసి ఎవరికి అసూయ పుట్టిందో ఏమో కానీ మృత్యువు రూపంలో వీరి సంతోషాన్ని కబలించింది.

శుక్రవారం ఉన్నఫలంగా కిరణ్ కి గుండెపోటు రావడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు బెంగళూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కిరణ్ శనివారం ఉదయం మరణించడంతో అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

తాను ఎంతగానో ప్రేమించే తన భర్త మరణ వార్తను భార్య పూజ తట్టుకోలేకపోయింది. తన భర్త లేడన్న చేదు వార్తను దిగమింగే లేక తన భర్తను అంత్యక్రియలకు తీసుకు వెళ్ళగానే తాను ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చూసిన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా తన బిడ్డలిద్దరిని కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఈ షాక్ నుంచి తేరుకున్న కుటుంబసభ్యులు కొంత సమయానికి పూజ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago