బ్యాంక్ టైమింగ్స్ మారాయ్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రతరంగా మారడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలోనే మరికొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ కార్యకలాపాలు పనివేళలు కూడా మార్చారు. ఇలాంటి తరుణంలోనే బ్యాంకు సిబ్బంది కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనివేళలో మార్పులు చేస్తూ, కేవలం 50 శాతం మంది సిబ్బందితోనే విధులు నిర్వర్తించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం తెలిపింది.

తాజాగా తెలంగాణలో కూడా పది రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో బ్యాంకు పనివేళలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వర్తించిన బ్యాంకులు నేటి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేయనున్నాయి. ఇప్పటికే బ్యాంకులలో కేవలం 50 శాతం మంది సిబ్బందితోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

తెలంగాణలో పది రోజులు లాక్ డౌన్ విధిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో సాధారణ కార్యకలాపాలకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి తెలిపింది. ఈ క్రమంలోనే బ్యాంకు పనివేళలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయని, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయని
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఆదేశాలు జారీ చేసింది.

బ్యాంకులకు మారిన పని వేళలో భాగంగా కేవలం అత్యవసరమైన సేవలను మాత్రమే అందించాలని, మిగతా ఎటువంటి సేవలైన ఆన్లైన్ ద్వారా నిర్వర్తించాలని బ్యాంకర్ల సమితి ఆదేశాలు జారీ చేసింది.ఇకపోతే ఏటీఎంలలో డబ్బులు భర్తీ చేసే వారు బ్యాంకు వచ్చే సమయంలో తప్పనిసరిగా వారి గుర్తింపు కార్డును తెచ్చుకోవాలనే సూచనలను కూడా తెలిపింది.