ఒంటరిగా ఓ ఆడపిల్ల లిఫ్ట్ కోసం అడిగితే.. మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరు లిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇలా ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు ఓ కానిస్టేబుల్. అదే అతడు చేసిన పాపం… ఆ కానిస్టేబుల్ మెడలోంచి చైన్ దొంగిలించి.. షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని సన్ సిటీలో ఈశ్వర్ ప్రసాద్ అనే ఏఆర్ కానిస్టేబుల్.. గత కొన్ని రోజుల నుంచి అక్కడే నివాసం ఉంటుంన్నాడు.
అతడు తన విధులు ముగించుకొని రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి వస్తుండగా.. గ్రీన్‌ల్యాండ్స్ వద్ద ఓ యువతి లిఫ్ట్ అడిగింది. అర్థరాత్రి .. అదికాక ఆడపిల్లా కదా అని అతడు ఆపి ఎటు వెళ్లాలి అని అడిగాడు. ఆమె పంజాగుట్ట అని చెప్పింది. ఆమెను పంజాగుట్ట వరకు ఎక్కించుకొని అతడు ఆమెను అక్కడ దించేసి వెళ్లిపోయాడు.
ఇంట్లో అతడు స్నానం చేస్తున్న సమయంలో మెడలో చైన్ కనిపించలేదు. వెంటనే అతడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన నవంబర్ 12 న జరిగింది. మళ్లీ నవంబర్ 16 న రాత్రి ఇలానే మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా అక్కడి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఆమెను విచారణ చేపట్టగా.. కానిస్టేబుల్ వద్ద చైన్ దొంగిలించింది తానే అంటూ ఒప్పుకుంది. కాగా ఆమె ట్రాన్స్ జెండర్ గా పోలీసులు గుర్తించారు. ఆమె బెంగళూరుకు చెందిన అంజూన్ అని.. కొన్ని రోజుల క్రితం ఇలా హైదరాబాద్ కు వచ్చి.. ఇటువంటి దంగతనాలకు చేస్తుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…