Hyper Aadi: హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమైన ఇతర బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్న హైపర్ ఆది మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్న ఈయన త్వరలోనే ఓ రాజకీయ పదవి అందుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తనకు ఎలాంటి రాజకీయ పదవులు అవసరం లేదని ఎలాంటి పదవులను ఆశించి నేను పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపలేదని వెల్లడించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా రోజా గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. 2024 ఎన్నికలలో భాగంగా రోజా గురించి పలువురు జబర్దస్త్ కామెడీగా సంచలన ఆరోపణలు చేశారు.
ఇలా రోజా గురించి ఎంతోమంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే రోజా గురించి హైపర్ ఆదికి ప్రశ్నలు ఎదురయ్యాయి. రోజా గారికి జగన్ అంటే ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఇలా ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. అయితే జబర్దస్త్ జడ్జిగా రోజా గారు అంటే నాకు ఎప్పటికీ గౌరవమే అని తెలిపారు.
జడ్జిగా ఎప్పుడు గౌరవమే..
నేడు నేను ఈ స్థాయిలో ఇంత పాపులర్ అయ్యాను అంటే అందుకు కారణం రోజా గారేనని తెలిపారు. నాతో పాటు చాలామంది ఎదుగుదలకు ఆమె కారణమయ్యారు. ఇలా ఒక జడ్జిగా తన పట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది అంటూ రోజా గురించి హైపర్ ఆది చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే రోజాపై షకలక శంకర్ కిరాక్ ఆర్పి వంటి వారు సంచలన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆది మాత్రం రోజా గురించి ఎంతో ఉన్నతంగా మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…