Hyper Aadi: కమెడియన్ హైపర్ ఆది తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నిర్మాతగా చేసిన కేశవ చంద్ర రమావత్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమా ఈనెల 22వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఒక జబర్దస్త్ కమెడియన్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన రాకింగ్ రాకేష్ ఇలా సినిమాలలో హీరోగా నటిస్తూ ఆ సినిమాని ఆయనే స్వయంగా నిర్మించటం విశేషం.
ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఈనెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు తన తోటి జబర్దస్త్ కమెడియన్స్ అలాగే బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. అలాగే హైపర్ ఆది కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది రోజా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత రోజా గారిని ఇలా ఈ వేదికపై కలవడం సంతోషంగా ఉందని తెలిపారు.. ఇకపోతే ఇటీవల రాజకీయాల పరంగా రోజా గారిని హైపర్ ఆది ఏమన్నారో తెలుసా అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యూస్ కోసం ఎన్నో వార్తలను రాశారు.
ఈరోజు నేను ఇక్కడ చెబుతున్న నేను ఇంతవరకు రోజా గారిని ఎప్పుడు ఎక్కడ కూడా చెడుగా మాట్లాడలేదని, తన గురించి అలా ఎప్పటికీ మాట్లాడనని హైపర్ ఆది తెలిపారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీ చాలా బాగుందని వెల్లడించారు. పుష్ప సినిమా త్వరలోనే రాబోతోంది ఇక ఆస్కార్ అవార్డు రావడం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల సినిమాలలో నటించడం. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా 100% నటించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా అద్భుతంగా ఉంది అంటూ హైపర్ ఆది ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…