Hyper Adhi : జబర్దస్త్ నుండి ఎదిగిన కమెడియన్ హైపర్ ఆది కి పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆది జబర్దస్త్ పుణ్యమా అని నేమ్ ఫేమ్ ఆస్తులు సంపాదించుకుని కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆది తన పంచ్ డైలాగులకు జబర్దస్త్ లో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇదంతా గతం అనాలేమో, ఎందుకంటే మొదట్లో ఆది పంచ్ డైలాగులు ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకునేలా ఉండేవి. ఇక ఆది కెరీర్ అటు జబర్దస్త్ ఇటు ఢీ షో అంటూ మరో వైపు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ ఇలా చేతి నిండా సంపాదిస్తున్నాడు. అయితే ఇప్పుడు పాలిటిక్స్ వైపు చూస్తున్నాడు ఆది.
జనసేన నుండి ఎమ్మెల్యే గా ఆది…
జబర్దస్త్ లో పంచ్ లతో ఆకట్టుకున్న ఆది, ఆ షోలో మెగా అభిమానులకు అలానే నాగబాబు కి బాగా చేరువయ్యాడు. అలా నాగబాబుతో ఉన్న సన్నిహిత్యంతోనే ముందు ఎన్నికలలో జనసేన తరపున ప్రచారం చేసాడు. ఇక ‘హరి హార వీర మల్లు’ సినిమాలో నటిస్తున్న ఆది ఆ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ కు బాగా దగ్గరయ్యాడు. అధినేత తో అరగంట మాట్లాడి మాటలతో ఆకట్టుకునేసాడు. అసలే మనోడి పంచులు మామూలుగా ఉండవు. ఇక పొలిటికల్ పంచులు కూడా ఆది మామూలుగా వేయడం లేదు. అలా జనసేన లో చురుకుగా ఉన్న ఆది ఇప్పుడు అధినేత వద్ద ఎమ్మెల్యే టికెట్ కు హామీ తీసుకున్నట్లు ప్రచారం చేసాడు.
రణ స్థలం ప్రచార సభలో ప్రత్యర్థ పార్టీ పై పంచుల వర్షం కురిపించిన ఆది శ్రీకాకుళం యువశక్తి సభలో ఒక అభ్యర్థి గా మాట్లాడుతున్నా అంటూ స్పీచ్ ఇవ్వడంలో అర్థాలు వేరే ఉన్నాయంటూ లెక్కలేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం జనసేన మెంబెర్ గానే పంచులతో అల్లాడించిన ఆది ఇక ఎమ్మెల్యే అభ్యర్థి గా నిలబడితే ఇక ప్రచారం లో ప్రత్యర్థుల మీద సటైర్లు మామూలుగా ఉండవు అనేది మాత్రం పక్కా. హైపర్ ఆది స్వస్థలం ప్రకాశం జిల్లా చీమకుర్తి. అయితే జనసేన రాజకీయ సమీకరణలతో ఎక్కడ సీటు కేటాయించినా పోటీ చేస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…