Jenna Ortega : ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. అందులోనూ జక్కన్న డైరెక్షన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన సినిమాను మరో రేంజ్ లో నిలబెట్టాయి. అయితే వారి కష్టానికి ఫలితంగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఇంతవరకు ఆసియన్ పాటకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి. అదీ కాక మన ఇండియన్ సినిమా అందునా తెలుగు సినిమాకు రావడంతో అందరికీ ఈ అవార్డు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ పాట కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ పడిన కష్టం అంథా ఇంతా కాదు. ఆ కష్టానికి మంచి ఫలితం దక్కిందని చెప్పొచ్చు. ఇక గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు నాటు నాటు పాటకు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా అటు ఇండియన్స్ మొత్తం గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక ఆ అవార్డు ఇచ్చే వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ అవార్డు ను ప్రకటించిన ముద్దుగుమ్మ కూడా అందరినీ ఆకర్శించింది.
హాలీవుడ్ నటి జెన్నా…
నాటు నాటు పాటకు అవార్డు వచ్చిందని వేదిక మీద ప్రకటించిన ముద్దుగుమ్మ జెన్నా ఓర్టేగా హాలీవుడ్ సినిమాల్లో నటించింది, అలానే టీవీ షోలలో కూడా నటించింది. ‘వెడ్నెస్ డే’ అనే టెలివిజన్ సిరీస్ కు గానూ ఉత్తమ నటిగా నామినేట్ అయ్యింది. కానీ విజేతగా నిలవలేదు. జెన్నా ఓర్టేగా, 2002 సెప్టెంబర్ 27న కొచెల్లా వ్యాలీ.. కాలిఫోర్నియాలో జన్మించింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన జెన్నా మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆ తర్వాత ‘జన్నే ది వర్జిన్’ అనే వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకుంది. 2013 లో ‘ఐరన్ మాన్ 3’ లో ఉపాధ్యక్షుడు కూతురిగా మెరిసింది.
ఇక డిస్నీలో వచ్చిన ‘స్టక్ ఇన్ ది మిడిల్’ సిరీస్ బాగా పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన ‘ఎలెనా ఆఫ్ అవతార్’ కు గానూ ఇమేజిన్ అవార్డ్ అందుకుంది జెన్నా. ఇక జెన్నా నటనకు ఎంటీవీ మూవీ, టీవీ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇక నటనలోనే కాకుండా జెన్నా ఓర్టేగా సామాజిక కార్యక్రమాలలో కూడా చురుగా ఉంటుంది. 2016 లో క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అమ్మాయి కోసం ఫండ్ రైజ్ కార్యక్రమం నిర్వహించింది. ప్రస్తుతం జెన్నా ఫైనెస్ట్ కైండ్, స్క్రీమ్ 6, మిల్లర్స్ గర్ల్, వింటర్, స్ప్రింగ్, సమ్మర్ ఆర్ ఫాల్ చిత్రాల్లో నటిస్తోంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…