Featured

Veera Simha Reddy : అన్ స్టాపబుల్ అనిపించిన బాలయ్య… వీర సింహా రెడ్డి తో మొదటి రోజు రికార్డు కలెక్షన్స్… కుర్ర హీరోలను పక్కకు నెట్టిన నటసింహం…!

Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ వీర సింహా రెడ్డి. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో, బాలయ్య బాబు కాంబినేషన్ లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఇది. అఖండ సినిమా విజయంతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న బాలయ్య బాబు, క్రాక్ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న గోపిచంద్ మలినేనిల కాంబినేషన్ వచ్చిన సినిమా కాబట్టి ప్రేక్షకులలో ఈ సినిమా పై భారీ అంచనాలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్టే మొదటి రోజు సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. బాలయ్య బాబు సినిమా కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో వీర సింహా రెడ్డి రికార్డు సృష్టించింది.

ఎన్టీఆర్, బన్నీ, మహేష్ లకు సాధ్యం కానీ వసూళ్లు…

బాలయ్య బాబు వీర సింహా రెడ్డి తో మాస్ జాతర చేసాడు. ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోశాడు. అన‌కాప‌ల్లి నుంచి హైద‌రాబాద్‌, అమెరికా వ‌ర‌కు ఫ‌స్ట్ డే అన్ని థియేట‌ర్ల‌లో అన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. దీనికి తోడు ఫ‌స్ట్ డే సోలో రిలీజ్ రావ‌డంతో పాటు తెలుగు గ‌డ్డ‌మీద ఉన్న అన్ని థియేట‌ర్ల‌లోనూ వీర‌సింహా రెడ్డి వేశారు, దీనికి బాలయ్య క్రేజ్ కలిసి రావడంతో సినిమా వసూళ్లు బాగా పెరిగాయి. ఉదయం నాలుగు గంటలకే సినిమా షో మొదలు కావడం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కోపరేట్ చేయడంతో వీర సింహా రెడ్డి మొదటి రోజు వీర విహారం చేసాడు. కలెక్షన్ దగ్గరికి వస్తే మొదటి రోజు ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ మార్క్ వ‌సూళ్ల‌కు దగ్గరైన ఈ సినిమా సీడెడ్‌లోనే ఏకంగా రు. 6 కోట్ల‌కు పైగా షేర్ వసూలు చేసింది.

నైజాంలోనూ మొదటి రోజు 3.9 కోట్ల నెట్ వ‌సూళ్లు రాబ‌ట్టి బాలయ్య కెరీర్ లోనే ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రంగా నిలబడింది వీర సింహా రెడ్డి. ఇక జీఎస్టీతో క‌లిపి చూస్తే ఏకంగా 5.2 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక తెలంగాణ, హైద‌రాబాద్‌లో కేవ‌లం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మాత్ర‌మే రు. 43 ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూల్లు రాబ‌ట్టింది. ఇక ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫ‌స్ట్ డే రు. 54 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టి కుర్ర హీరోలకు సాధ్యం కానీ రికార్డును నెలకొల్పాడు బాలయ్య. సినిమా మీద మొదటి రోజే మిశ్రమ స్పందన వచ్చింది అయినా ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయి. అదే సినిమా సూపర్ గా ఉంది అనే ఫీడ్ బాక్ వచ్చుంటే ఇక కలెక్షన్ ఎలా ఉండేవో మరి. ఏదేమైనా ప్రస్తుతం తెలుగు సినిమా లవర్స్ జై బాలయ్య మూడ్ లో ఉన్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago