Yendamuri Veerendranath: కథ రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన కేవలం రచయితగా మాత్రమే కాకుండా ఎన్నో మోటివేషనల్ కార్యక్రమాలలో పాల్గొని యువతకు ఎంతో అద్భుతమైన సూచనలు చేస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇక ఈయన రాసిన నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ విధంగా రచయితగా మోటివేటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో సినిమాలకు పనిచేశారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యండమూరి వీరేంద్రనాథ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు సినిమా గురించి యండమూరి ఈ సందర్భంగా తెలియజేశారు. మృగరాజు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అడవి మనిషి, ఇక మెగాస్టార్ చిరంజీవిని ఒక ఐఏఎస్ చదువుతున్న అమ్మాయి ప్రేమించాలి అంటే ఎలాంటి సన్నివేశాలను పెట్టాలో తాను చెప్పినట్లు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యండమూరి వెల్లడించారు. ఈ విధంగా మృగరాజు సినిమా కోసం తాను 2,3 సీన్లను చెప్పానని యండమూరి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.
ఈ విధంగా మృగరాజు సినిమా కోసం తాను కొన్ని సన్నివేశాలు చెప్పిన తర్వాత అదే సమయంలోనే మా అబ్బాయి ప్రణీత్ వివాహం. ఇక ప్రణీత్ పెళ్లి కోసం తనకు రెండు మూడు లక్షల అవసరమవుతాయని చిరంజీవి గారికి చెప్పడంతో ఆయన దేవి ప్రసాద్ గారితో మాట్లాడి తనకు డబ్బులు ఇప్పిస్తానని మాట ఇచ్చారు. అలా మృగరాజు కోసం నేను కొన్ని సీన్లు చెప్పగా చిరంజీవి దేవి ప్రసాద్ గారి దగ్గర నుంచి నాకు 4 లక్షల రూపాయల డబ్బు ఇప్పించారని యండమూరి ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…