Samantha: నువ్వు లేని జీవితం ఊహించుకోలేను..! సమంత కామెంట్స్ వైరల్..!
Samantha: హీరోయిన్ సమంత యాక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించి.. అక్కినేని ఫ్యామిలీలో ఎంట్రీ అయిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె చైతుతో విడాకులు కూడా తీసుకొని దాదాపు 5 నెలలు కావస్తోంది.
అయితే యాక్టర్ గా ఉన్న సమయంలో ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండగా.. ప్రస్తుతం ఆమె అంతకు ముందు కంటే ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. విడాకుల తర్వాత నాగ చైతన్య కంటే కూడా సమంత వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఆమె చేసే ప్రతీ పని.. ప్రతి యాక్టివిటీని మీడియో ప్రెసెంట్ చేస్తూ వస్తోంది.
ఇక ఆమె సినిమాల్లో ప్రస్తుతం ఫుల్ బిజీ గా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ షూటింగ్ కంప్లీట్ చేసిన సామ్ ప్రస్తుతం ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో ‘కాతు వాకుల్ రెండు కాదల్’ అనే సినిమాలోనూ నటిస్తుంది.
కెరీర్ పరంగా ఆమెకు తిరుగులేదనే చెప్పాలి. ఇటు కుదిరినప్పుడల్లా సినిమాలు తీస్తూ..వెకేషన్స్ చుట్టేస్తుంది. తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ.. నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
తాజాగా సమంతకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేరళలోని అతిరప్పిల్లీ వాటర్ ఫాల్స్ వెళ్లింది సమంత. అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఫొటోలకు పోజులిచ్చి.. వాటిని ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఆ ఫొటోల కింద జలపాతాలను పోల్చుతూ.. మోటివేషనల్ కొట్స్ తో ఆలోచింపజేసింది. అందులో ఓ ఫొటోలో తన బెస్ట్ ఫ్రెండ్ తో ఓ ఫొటోను షేర్ చేసింది. నువ్వు లేకుండా ఈ జీవితాన్ని ఊహించుకోలేను.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బెస్ట్‌ఫ్రెండ్ అంటూ ఆమెతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…