Actor Naresh: రమ్య రఘుపతి నుంచి నాకు ప్రాణహాని ఉంది.. నరేష్ షాకింగ్ కామెంట్స్!
Actor Naresh: సినీ నటుడు నరేష్ వ్యక్తిగత విషయాలతో గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని ఆ మూడు పెళ్లిళ్లు కూడా పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే నరేష్ వ్యవహారంలోకి నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు.
ఇక నరేష్ తో తనకు విడాకులు వద్దని తనతో కలిసి జీవించడానికి ఆసక్తి కనబరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే రమ్య మాట్లాడుతూ పవిత్ర లోకేష్ కారణంగానే నాకు నరేష్ కి మధ్య గొడవలు వచ్చాయని ఆమె వల్లే మేము విడిపోయాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై నరేష్ స్పందిస్తూ రమ్య ఎప్పుడు కూడా నాకు భార్యగా వ్యవహరించలేదని, తను తన పర్సనల్ ప్రొఫెషనల్ విషయాల గురించి ఎంతో బిజీగా గడుపుతో ఉన్నారని తనకు అక్రమ సంబంధం ఉండడం వల్లే తనకు విడాకులు ఇచ్చానని తెలిపారు.
రమ్య తన జీవితంలోకి వచ్చి తన జీవితాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.తన డబ్బు కావాలని పెద్ద ఎత్తున నన్ను బ్లాక్ మెయిల్ చేసిందని జైలుకు వెళ్తానంటే పది లక్షలు నేనే ఇచ్చానని అలాగే తన అప్పులు మొత్తం తానే కట్టానని నరేష్ వెల్లడించారు.ఇక ఇప్పుడు బెంగుళూరుకు వెళ్లి అక్కడ నా గురించి తప్పుగా ఆరోపణలు చేస్తుందని నరేష్ వెల్లడించారు. ఇకపోతే తన భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేస్తుందని, అందుకే నా దగ్గర డబ్బు గుంజి నన్ను మోసం చేయాలని చూస్తుందని నరేష్ ఆరోపించారు.
రమ్య మానసిక పరిస్థితి బాగోలేదని తనని మంచి సైకియాట్రిస్ట్ కి చూపించాలని నరేష్ కామెంట్స్ చేశారు. ఇకపోతే తనకు రమ్యా నుంచి రమ్య ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందని తెలుసుకుని తనతో విడాకుల కోసం అప్లై చేశానని నరేష్ తెలిపారు. ఇక తనకూ కొన్ని అవసరాలు ఉంటాయి. తనకు ఎమోషనల్ సపోర్ట్ గా ఒకరు కావాలి ఆ సమయంలోనే తనకు పవిత్ర పరిచయమైందని,తను నాకు మూడు సంవత్సరాల క్రితమే పరిచయమైంది కానీ రమ్య నా జీవితంలో ఎనిమిది సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయింది అంటూ నరేష్ వెల్లడించారు.ఇక పవిత్రతో సహజీవనం చేస్తానా పెళ్లి చేసుకుంటానా అనే విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని తాను ఏం చేసినా అధికారకంగా తెలియజేస్తానని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…