Vijay Devarakonda: విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోపై భారీ ట్రోల్స్..ఇదేం క్రియేటివిటీ రా బాబు!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకొని, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన విజయ్ దేవరకొండ న్యూడ్ లుక్ విడుదల చేశారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ క్రమంలోనే విజయ్ యాంటీ ఫ్యాన్స్ ఈ ఫోటో పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ న్యూ లుక్ ఇదివరకే సంపూర్ణేష్ బాబు నటించిన క్యాలీఫ్లవర్ సినిమాని తలపిస్తుంది అలాగే అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమాల్లో కూడా ఇలాంటి న్యూడ్ లుక్ రావడంతో ఈ లుక్ పై పెద్ద ట్రోలింగ్ జరుగుతున్నాయి.
విజయ్ దేవరకొండ న్యూడ్ లుక్ పీకే సినిమా నుంచి కాఫీ కొట్టారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇలా న్యూడ్ లుక్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్లవర్స్ అడ్డుగా పెట్టుకొని ఉండడం ఏంటి.. ఇదెక్కడి క్రియేటివిటీ రా బాబు అంటూ పెద్ద ఎత్తున నేటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.ఒక సినిమా నుంచి పోస్టర్ విడుదలయితే సినిమా కంటెంట్ గురించి మాట్లాడుకోవాలి కానీ ఇలా సెటైర్లు వేసేలా ఉండకూడదు అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.
ఈ విధంగా విజయ్ లుక్ సోషల్ మీడియాలో అతి తక్కువగా వ్యూ సాధించిన పోస్టర్ గా రికార్డు సృష్టించింది. అదేవిధంగా ఈ పోస్టర్ పై ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందించి తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి విజయ్ బోల్డ్ లుక్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…