Featured

Poojitha : తప్పు ఆమెదే.. నరేష్, పవిత్రల రిలేషన్ ఏంటంటే.. నరేష్ చెల్లి పూజిత కామెంట్స్…!

Poojitha : ప్రతిరోజు ఒక కొత్తమలుపు తిరుగుతూ మీడియా లో వైరల్ అవుతున్న నరేష్ పవిత్ర లోకేష్, రమ్య ల ఇష్యూ లో తప్పు ఎవరి వైపు ఉంది నరేష్, రమ్యలలో అంటూ చర్చలు మొదలయ్యాయి. రమ్య కన్నడ మీడియాను ఆశ్రయించి నాకు నా భర్త కావాలి అంటూ విడాకులు ఇవ్వలేదు, గన్ తో బెదిరించి విడాకులు ఇవ్వడానికి ఒప్పించాడు నరేష్ అంటూ రమ్య ఆరోపణలు చేసింది. ఇక వీటిపై నరేష్ కి చెల్లి వరుస అయ్యే సినిమాలో నటించిన పూజిత పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలు చెప్పారు.

రమ్య, నరేష్ 8 సం నుండి కలిసిలేరు…

రమ్య అపద్ధాలు చెబుతోంది, ఎనిమిది సంవత్సరాలనుండి వాళ్లిదరు కలిసి లేరు. ఏ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినా వాళ్ల ఇంటికి నేను వెళ్తాను ఆమె నాకు ఎక్కడా కనిపించలేదు. విజయ నిర్మల అమ్మ చనిపోయినప్పుడు మాత్రమే ఒకసారి చూసాను ఆ తరువాత పదకొండు రోజుల దినాలకు ఆమె రాలేదు. ఇక ఆమె డబ్బులు మోసం చేసిందని పోలీస్ కేసు అవ్వడము తెలిసిందే అప్పటికే నరేష్ గారు ఆమెకు నాకు ఏం సంబంధం లేదని చెప్పారు. ఇక అప్పుడంత ఏం మాట్లాడకుండా ఇప్పుడు కన్నడ మీడియా దగ్గర పవిత్ర నరేష్ ల క్యారెక్టర్స్ ను దిగజారుస్తోంది. వాళ్ళు నిజంగా ఫ్రెండ్స్ మాత్రమే అయ్యుండొచ్చు, ఒక వేల వాళ్ళు సహజీవనం చేస్తున్నా ఈమె తో విడాకులు అవ్వకుండా పెళ్లి చేసుకోలేరు కదా మరి ఎందుకు వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారని ఆరోపణలు చేస్తోంది అంటూ కామెంట్స్ చేసారు.

ఇక విజయ నిర్మల గారు రమ్య కు సపోర్ట్ ఇచ్చారు అని చెప్పుకుంటోంది. మూడేళ్ళ క్రితం విజయ నిర్మల గారు ఉన్నారు కదా మరి నరేష్ గన్ పెట్టి బెదిరించినపుడు ఆమె దగ్గర చెప్పకుండా ఏం చేసింది, ఆమె చెప్పేవన్నీ అపద్ధాలే అంటూ చెప్పారు పూజిత. ఇక తనకు భర్త కావాలనుకుంటే ఇలా మీడియా ముందుకు వెళ్లి అతన్ని దిగజారుస్తారా, మళ్ళీ ఆయన కావాలి అంటూ కాళ్ళు పట్టుకుంటా అనడమేంటి. నిజంగా ఆమెకు, నరేష్ తప్పు ఉంటే వ్యక్తిగతంగా వాళ్లే కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకోవాల్సింది. ఇలా రోడ్డుకి ఎక్కి పరువు తీసేలా వ్యవహరించి ఉండేది కాదు. ఒక్కో ఛానల్ ముందు ఒక్కో మాట మారుస్తున్న ఆమె చెప్పేవన్నీ అపద్ధాలే అంటూ పూజిత తెల్చేశారు. ఇక పవిత్ర లోకేష్, నరేష్ లు ఫ్రెండ్స్ అయ్యిండొచ్చు, లేకపోతే నిజంగానే అంతకు మించి రిలేషన్ లో ఉన్నారేమో, భర్త వద్దని 8 ఏళ్ల క్రితమే వెళ్లిపోయిన నీకు ఇక నీ భర్త ఎవరితో ఉంటే ఎందుకు అంటూ ప్రశ్నించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago