ట్వింకిల్ ఖన్నా అంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని అందరికి గుర్తుకొస్తుంది. అలనాటి తార డింపుల్ కపాడియా కూతురు, అక్షయ్ కుమార్ భార్యగా బీ టౌన్‌లో అందరికి తెలుసు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చులన్నీ తనే పెట్టుకుంటానని ఆమె చెప్పింది. వారి పిల్లల చదువు కోసం పెట్టే ప్రతీ పైసా బాధ్యత తనదే అని చెప్పుకొచ్చింది. ఇక ట్వింకిల్, అక్షయ్ 2001లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అందులో కొడుకు ఆరవ్ , కూతురు నితారా. ఆమె చిన్నతనంలో తన తల్లి తనలో స్వావలంబన భావాన్ని కలిగించిందని చెప్పింది. చిన్న తనంలోనే కష్టం అంటే తెలుసుకున్నానని.. తన కాళ్లపై ఎలా నిలబడాలో వివరంగా తన తల్లి చెప్పిందని అన్నారు. తన ట్వీక్ ఇండియా యూట్యూబ్ ఛానెల్ కోసం నటి కాజోల్‌తో సంభాషించారు. కాజోల్ తన కెరీర్‌లో ఎంతో కొంత సంపాదించి ఉంటుంది కాబట్టి.. కాజోల్ మరియు ఆమె భర్త అజయ్ దేవగణ్ తమ ఆర్థిక పరిస్థితులను ఎలా నిర్వహిస్తుంటారో అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ట్వింకిల్ ఆమెను ఇలా అడుగుతుంది.. “మీరు మీ జీవితంలో ఎక్కువ కాలం సినిమాలు చేశారు.. కాబట్టి మీరు మీ సొంతంగా కొంత సంపాదన కూడగట్టుకున్నారు. మీరు మీ ఇంటి బిల్లులు విభజించుకుంటారా.. ప్రతిదానికీ ఎవరు చెల్లిస్తారు.. ? ఉదాహరణకు.. మా జీవితంలో పిల్లలకు సంబంధించి అన్నీ పాఠశాల, విద్య, నేను చెల్లిస్తాను. ఎందుకంటే అప్పుడు నేను వారికి చెప్పగలను, ‘నా వల్ల మాత్రమే వాళ్లు చదువుకున్నారు’ అని. మరి మీ విషయంలో ఎలా..? మీరు ఇంట్లో ఏమైనా ఖర్చులు పెట్టుకుంటారా.. లేదా మొత్తం మీ భర్తదేనా..? అని ప్రశ్నిస్తుంది. దానికి కాజల్ ఏం చెప్పారంటే.. “కాదు, అజయ్ మరియు నేను దీని గురించి చాలా స్పష్టంగా ఉన్నాం.
అజయ్ కి సంబంధించి నాదే.. నాది కూడా నాదే అని చెబుతుంది. పిల్లలు మాత్రం నా వాళ్లే అని చెబుతుంది. నిజానికి సందర్బాన్ని బట్టి ఖర్చులు ఎవరు పెట్టాలనేది డిసైడ్ చేసుకుంటామని అన్నారు. ఇక ఆన్ లైన్ లో ఏమైనా కొనాలంటే.. తాను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానని.. ఇక ఆఫ్ లైన్ లో అయితే అతడే ఎక్కువ ఖర్చు పెడతాడని చెప్పింది. ఇక ఓ విషయంలో తన భర్త అజయ్ కు తాను ‘హ్యాండ్ ఆన్ ఫాదర్’ అని అంటానని చెప్పింది. ఎందుకంటే.. తన కూతురు నైసా, కొడుకు యుగ్ ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పాఠశాలకు వెళ్లేదాకా అతడే చూసుకుంటాడని.. పాఠశాల నుంచి తిరిగి వచ్చే సమయంలో కూడా అతడే బాధ్యత తీసుకుంటాడని చెప్పింది. ఈ విషయంలో అజయ్ ని ఆమె తెగ పొగిడింది. 1999లో అజయ్, కాజోల్ కు వివాహం అయిన విషయం తెలిసిందే.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…