బాలీవుడ్ లో బోల్డ్ పాత్రలు చేయాలన్న , బోల్డ్ గా మాట్లాడాలన్నా కియారా కి కొట్టిన పిండి.. నెట్ ఫ్లిక్స్ లోని ఓ సినిమా లో ఆమె చేసిన బోల్డ్ పాత్ర కి ఇప్పటికే మంచి స్పందన అందిస్తుంటారు ప్రేక్షకులు..బాలీవుడ్ లో బాగానే ఉన్నా టాలీవుడ్ లోఆమె కెరీర్ మాత్రం ఏమంత బాగాలేదని చెప్పాలి. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కియారా అద్వానీ నటించడానికి పెద్ద స్టార్ హీరోలతో నటించినా ఎందుకో ఆమెకు కలిసి రాలేదు.. ఆ రెండు సినిమాలు తప్పా ఆమెకు మళ్ళీ అవకాశాలు రాలేదు.
ఆ రెండు సినిమాలతో గ్లామర్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్నా కియారా కి ఇక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకున్నారు కానీ అదృష్టం తిరగబడి ఒక్క అవకాశం కూడా రాలేదు. దాంతో మళ్ళీ తాను అరంగేట్రం చేసిన బాలీవుడ్ కే వెళ్ళింది. అక్కడ కొన్ని మంచి మంచి సినిమాలు చేసినా అక్కడకూడా ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రావట్లేదు. ఈ నేపథ్యంలో ఆమెకు రాబోయే చిత్రాలు అయినా హిట్ ఇస్తాయో అని ఎదురుచూస్తుంది.. తెలుగులో కూడా ఆమెను పలు సినిమాల్లో చేయించాలని ట్రై చేస్తున్నారు..
ఇకపోతే తాజాగా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. సినిమాల స్క్రిప్టులు వింటున్నానని , తనకు నచ్చిన కథ దొరికితే ఖచ్చింతంగా ఎవరి తోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అలాగే తన ఫ్యామిలీ ఎపుడు తనకి సపోర్టుగా ఉంటుందని వెల్లడించింది.మీడియా అతను మరో ప్రశ్న ఇలా అడిగాడు.. మిమ్మల్ని ప్రియుడు మోసగిస్తే.. ఏంచేస్తారు అని అడుగగా… అతడిని జన్మలో కూడా క్షమించను, అలాగే నమ్మను కూడా , తన మొహాన్ని చూడటానికి కూడా ఇష్టపడను అని సంచలన వాక్యాలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…