టాలీవుడ్ లో ఆడవారిపై అన్యాయాలు జరిగితే స్పందించే మహిళలు చాల తక్కువ మంది ఉన్నారు.. అలాంటి వారిలో ఒకరు కరాటే కళ్యాణి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన కరాటే కళ్యాణి కృష్ణ, మిరపకాయ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ్రహ్మానందం లాంటి కమెడియన్స్ కి జోడిగా నటిస్తూ వారితో పాటుగా ప్రేక్షకులను నవ్వించేవారు. ఆమె సినిమాలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయ్యారు..
ఆ మధ్య బ్రహ్మానందం పై కొన్ని సంచలన ఆరోపణలు చేసిన ఆమె బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆమె శ్రీరెడ్డి ఇష్యూ లో చేసిన సంచలనం అంత యింతా కాదు. సినిమా ఇండస్ట్రీ లోని ఆడవారికి సపోర్ట్ చేస్తూ ఆమె ఆ ఇష్యూ లో న్యాయం చేసేందుకు ఎంతో ప్రయత్నించారు. క్యాస్టింగ్ కౌచ్, రామతీర్థం ఘటనలపై ఆమె ఇప్పటికే పోరాటాలు చేశారు. రీసెంట్ గా హరికథ గానంలో తనకు పరిచయమైన యువతి మోసపోయిందని, ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ కరాటే కల్యాణి ఎస్పీని కలిసారు.
లవ్ జిహాద్‌కు గురైన ఓ అమ్మాయికి న్యాయం చేయాలని గట్టిగా పోరాడుతున్నారు.ఇందులో భాగంగా లవ్‌జిహాద్ పై రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. గుంటూరు ఏటీ అగ్రహారం ఎనిమిదో లైన్‌కు చెందిన యువతి 2018లో హరికథ విద్య నిమిత్తం తిరుపతి వెళ్లింది. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన యువకుడు అహ్మద్ తషీఫ్ ఆమెకు పరిచయమయ్యాడు. 2019లో లాడ్జికి తీసుకెళ్లి ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయిన యువతిపై లైంగిక దాడి చేసి, వీడియోలో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…