టాలీవుడ్ లో ఆడవారిపై అన్యాయాలు జరిగితే స్పందించే మహిళలు చాల తక్కువ మంది ఉన్నారు.. అలాంటి వారిలో ఒకరు కరాటే కళ్యాణి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన కరాటే కళ్యాణి కృష్ణ, మిరపకాయ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ్రహ్మానందం లాంటి కమెడియన్స్ కి జోడిగా నటిస్తూ వారితో పాటుగా ప్రేక్షకులను నవ్వించేవారు. ఆమె సినిమాలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయ్యారు..

ఆ మధ్య బ్రహ్మానందం పై కొన్ని సంచలన ఆరోపణలు చేసిన ఆమె బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆమె శ్రీరెడ్డి ఇష్యూ లో చేసిన సంచలనం అంత యింతా కాదు. సినిమా ఇండస్ట్రీ లోని ఆడవారికి సపోర్ట్ చేస్తూ ఆమె ఆ ఇష్యూ లో న్యాయం చేసేందుకు ఎంతో ప్రయత్నించారు. క్యాస్టింగ్ కౌచ్, రామతీర్థం ఘటనలపై ఆమె ఇప్పటికే పోరాటాలు చేశారు. రీసెంట్ గా హరికథ గానంలో తనకు పరిచయమైన యువతి మోసపోయిందని, ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ కరాటే కల్యాణి ఎస్పీని కలిసారు.

లవ్ జిహాద్‌కు గురైన ఓ అమ్మాయికి న్యాయం చేయాలని గట్టిగా పోరాడుతున్నారు.ఇందులో భాగంగా లవ్‌జిహాద్ పై రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. గుంటూరు ఏటీ అగ్రహారం ఎనిమిదో లైన్‌కు చెందిన యువతి 2018లో హరికథ విద్య నిమిత్తం తిరుపతి వెళ్లింది. కర్నూల్‌ జిల్లా ఆదోనికి చెందిన యువకుడు అహ్మద్‌ తషీఫ్‌ ఆమెకు పరిచయమయ్యాడు. 2019లో లాడ్జికి తీసుకెళ్లి ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయిన యువతిపై లైంగిక దాడి చేసి, వీడియోలో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here