Mahesh Babu - Sitara: వింటే వింటుంది లేదంటే లేదు.. సితారపై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
MaheshBabu-Sitara: ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీ కంటూ టైమ్ కేటాయించే స్టార్లలో ముందు వరసలో ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా షూటింగ్ ల నుంచి విరామం దొరికినప్పుడల్లా.. భార్య నమ్రతా, కుమారుడు గౌతమ్, కూతురు సితారలతో ఫారన్ ట్రిప్పులు వేస్తుంటారు మహేష్ బాబు.
తాజాగా బాలయ్యతో ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కుమారుడు గౌతమ్ ఇప్పటికే ‘ 1 నేనొక్కడినే’ సినిమాలో కనిపించాడు. సితార, గౌతమ్ లకు కూడా భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే బాలయ్యతో అన్ స్టాపబుల్ షో గ్రాండ్ ఫినాలే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోకు ప్రత్యేక అతిథిగా మహేష్ బాబు వచ్చారు.
తాను మొదట సినిమాల్లో యాక్ట్ చేస్తున్నానని.. ఎవరికీ చెప్పలేదని.. తాను తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నానని టీజ్ చేసేవారని గుర్తుచేసుకున్నారు. నాన్న గారి సినిమాలు వేసవిలో ఊటీలో షూటింగ్ జరుపుకునేవని.. ఆయనతో పాటు నేను కూడా వెళ్లేవాడినని మహేష్ బాబు అన్నారు.
దాసరి నారాయణరావు డైరెక్షన్ లో తెరకెక్కిన నీడ తను నటించిన తొలి సినిమా అని తను నటించిన సినిమాలు సక్సెస్ కావడంతో చైల్డ్ స్టార్ అయ్యాడని తనపై కామెంట్లు వచ్చాయని మహేష్ తెలిపారు. మహేష్ బాబు డీసెంట్ అనుకుంటే గౌతమ్ డీసెన్సీ కా బాప్ అని బాలయ్య చెప్పగా మహేష్ నవ్వారు. ఈ షోలో బాలయ్య ఎవరు క్యాట్, ఎవరు బ్రాట్ .. అంటూ ప్రశించగా.. గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ అంటూ మహేష్ అన్నారు. సితారది వాళ్ల అమ్మపోలిక అని తాట తీసేస్తుందని అన్నారు. వేకేషన్ క్యాన్సిల్ అయితే గౌతమ్ నార్మల్ గానే ఉంటాడని.. కానీ వేకేషన్ అంటే సితార చాలా ఎగ్జైట్ అవుతుందని.. క్యాన్సిల్ అయిందని తెలిసిందే ఇళ్లు పీకి పందిరి వేస్తుందని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…