General News

ఈ లక్షణాలు మీలో ఉన్నాయా… అయితే మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లే!

మీరు ప్రతిరోజు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకున్నప్పటికీ ఏపని చేయకుండానే త్వరగా అలసిపోతూ,తరచూ తలనొప్పి, కళ్ళు తిరగడం గుండె వేగంగా కొట్టుకోవడం,చర్మం గోళ్లు పాలిపోయినట్టు ఉండడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం వంటి లక్షణాలతో ఈ విధమైనటువంటి లక్షణాలు మీలో కనుక ఉంటే మీరు కచ్చితంగా ప్రమాదకర రక్తహీనత సమస్యకు దగ్గర అవుతున్నారని భావించవచ్చు.ఈ సమస్యకు ప్రధాన కారణం రక్తంలో ఎర్రరక్త కణాలు( హిమోగ్లోబిన్ )శాతం తక్కువగా ఉండడమే.

రక్తంలో ఎర్రరక్త కణాల శాతం తక్కువగా ఉండడానికి లేదా ఉత్పత్తి కాకపోవడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో ఐరన్, విటమిన్ బి12, ఫోలిక్‌ ఆసిడ్‌ వంటివి లోపిస్తే రక్తహీనత సమస్యతో బాధపడాల్సి వస్తుంది.రక్తహీనత సమస్యను ఏనీమియా అని కూడా అంటారు.ఈసమస్య ప్రధానంగా మహిళల్లో ఎక్కువగా వస్తుంది. మరియు చిన్న పిల్లలు ఈవ్యాధి బారిన పడితే వారి ఎదుగుదల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

రక్తహీనత సమస్యను చెక్ పెట్టడానికి లేదా భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి మనం తీసుకునే ఆహారంలో ఐరన్, పోలిక్ యాసిడ్,విటమిన్‌ B12 , విటమిన్ సి సమృద్ధిగా ఉన్నటువంటి బాదం, జీడిపప్పు, ఎండు కర్జూరం, పాలకూర, మెంతికూర మొలకెత్తిన గింజలు, బీట్రూట్, క్యారెట్ వంటి ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో ఎర్ర రక్తకణాలు అభివృద్ధి చెంది ప్రమాదకర రక్తహీనత సమస్యకు దూరంగా ఉండవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే ముందు జాగ్రత్త చర్యగా అనుభజ్ఞులైన వైద్యుని సంప్రదించడం ఉత్తమం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago