మీరు ప్రతిరోజు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకున్నప్పటికీ ఏపని చేయకుండానే త్వరగా అలసిపోతూ,తరచూ తలనొప్పి, కళ్ళు తిరగడం గుండె వేగంగా కొట్టుకోవడం,చర్మం గోళ్లు పాలిపోయినట్టు ఉండడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం వంటి లక్షణాలతో ఈ విధమైనటువంటి లక్షణాలు మీలో కనుక ఉంటే మీరు కచ్చితంగా ప్రమాదకర రక్తహీనత సమస్యకు దగ్గర అవుతున్నారని భావించవచ్చు.ఈ సమస్యకు ప్రధాన కారణం రక్తంలో ఎర్రరక్త కణాలు( హిమోగ్లోబిన్ )శాతం తక్కువగా ఉండడమే.

రక్తంలో ఎర్రరక్త కణాల శాతం తక్కువగా ఉండడానికి లేదా ఉత్పత్తి కాకపోవడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో ఐరన్, విటమిన్ బి12, ఫోలిక్ ఆసిడ్ వంటివి లోపిస్తే రక్తహీనత సమస్యతో బాధపడాల్సి వస్తుంది.రక్తహీనత సమస్యను ఏనీమియా అని కూడా అంటారు.ఈసమస్య ప్రధానంగా మహిళల్లో ఎక్కువగా వస్తుంది. మరియు చిన్న పిల్లలు ఈవ్యాధి బారిన పడితే వారి ఎదుగుదల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
రక్తహీనత సమస్యను చెక్ పెట్టడానికి లేదా భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి మనం తీసుకునే ఆహారంలో ఐరన్, పోలిక్ యాసిడ్,విటమిన్ B12 , విటమిన్ సి సమృద్ధిగా ఉన్నటువంటి బాదం, జీడిపప్పు, ఎండు కర్జూరం, పాలకూర, మెంతికూర మొలకెత్తిన గింజలు, బీట్రూట్, క్యారెట్ వంటి ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో ఎర్ర రక్తకణాలు అభివృద్ధి చెంది ప్రమాదకర రక్తహీనత సమస్యకు దూరంగా ఉండవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే ముందు జాగ్రత్త చర్యగా అనుభజ్ఞులైన వైద్యుని సంప్రదించడం ఉత్తమం.

































