Ileana: దేవదాసు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల నటి ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఇలియానా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.
ఇటీవల ఈ అమ్మడు గర్భంతో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసింది. అయితే పెళ్లికాకముందే ఇలా గర్భం దాల్చడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలియానాకి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పుట్టబోయే బిడ్డ తండ్రి గురించి మాత్రం ఇలియానా స్పందించటం లేదు. కానీ తరచూ సోషల్ మీడియా ద్వారా బేబీ బంప్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక తాజాగా ఇలియానా షేర్ చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బేబీ బంప్ తో ఉన్న ఇలియానా ఇటీవల కారులో రైడ్ కి వెళ్ళింది. అందుకు సంబంధించిన వీడియోని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తు.. సన్ అవుట్.. బంప్ అవుట్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఇలియానా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అని చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఇలియానా గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ లారెన్స్ మిచెల్ తో డేటింగ్ లో ఉన్న బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా కత్రినా కైఫ్ దంపతులతో కలిసి వారిద్దరూ వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయం మాత్రం ఇప్పటివరకు తెలియడం లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…