Naresh: సీనియర్ నటుడు నరేష్ ఇటీవల తరచూ వార్తలో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన పవిత్ర లోకేష్ తో నరేష్ రిలేషన్ లో ఉండటం వల్ల తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఇటీవల వీరిద్దరూ కీలకపాత్రలలో మళ్ళీ పెళ్లి అనే సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాకు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా.. నరేష్ ఈ సినిమాని నిర్మించాడు.
ఈనెల 26వ తేదీన ఈ సినిమా తెలుగు కన్నడ భాషలలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులలో నరేష్, పవిత్ర లోకేష్ బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా టీవీ షోలలో, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ .. పవిత్ర లోకేష్ తో తన రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో నరేష్ మాట్లాడుతూ…”
ఈ సినిమా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి ఆధారంగా తీసినదేనని, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదని నరేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, అనుమానం అనుబంధాలు లేకపోవడం వల్ల వివాహ వ్యవస్థ దెబ్బతింటుందని, వివాహ బంధం పై గౌరవానికి అర్థం పడుతూ ఈ సినిమాని రూపొందించినట్లు తెలిపాడు. అంతేకానీ ఎవరిమీద కక్ష తీర్చుకోవటానికి కాదని చెప్పుకొచ్చాడు.
కక్ష తీర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్ వీడియోస్ రిలీజ్ చేస్తే సరిపోతుందని 15 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరి సినిమా తీసి కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. పవిత్ర నన్ను నమ్మి వచ్చింది. నా ప్రాణం పోయేవరకు ఆమెకు అండగా ఉంటాను. మమ్మల్ని విడదీయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నేను ఆమెకు జీవితాంతం తోడుగా ఉంటాను అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ క్రమంలో పవిత్ర లోకేష్ మాట్లాడుతూ..” ఒక సినిమా షూటింగ్ సమయంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒక్కటే. ఒకరి మీద కక్ష తీర్చుకోవాలని ఉద్దేశం మాకు లేదు అంటూ పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చింది. నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…